Advertisementt

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కంటెంట్‌తో కొండవీడు

Thu 07th Jul 2022 07:03 PM
kondaveedu,kondaveedu movie,bpr cinema  ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కంటెంట్‌తో  కొండవీడు
Kondaveedu movie realese on 8th ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కంటెంట్‌తో కొండవీడు
Advertisement
Ads by CJ

దసరాజు గంగాభవాని సమర్పణలో  బి. పి. ఆర్ సినిమా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ, నళినీకాంత్, నవీన్‌రాజ్ నటీ నటులుగా సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో ప్రతాప్ రెడ్డి నిర్మించిన చిత్రం కొండవీడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 8 న గ్రాండ్ గా థి యే టర్స్ లాస్లో రిలీజ్ చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సందర్బంగా చిత్ర నిర్మాత ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. కొండవీడు సినిమా టీజర్, ట్రైలర్ ను విడుదల చేసిన  శ్రీకాంత్ గారికి, సునీల్ గారికి ధన్యవాదాలు.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా కూడా కోవిడ్ కారణంగా విడుదల చేయలేకపోయాం.దర్శకుడు మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ  సినిమాను చాలా ఫారెస్ట్ లొకేషన్స్ లలో షూట్ చేయడం జరిగింది.ఇందులో శ్వేతావర్మ తో పాటు మిగిలిన నటీ నటులు అందరూ చాలా చక్కగా నటించారు. టెక్నిషియకన్స్ అందరూ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది.ఈ సినిమా లిరికల్ సాంగ్స్ తో పాటు ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ గారు సినిమా చూడడానికి వచ్చి తనకు నచ్చడంతో తను ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు సిద్దార్థ శ్రీ మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాత ప్రతాప్ రెడ్డి గారికి నేను చెప్పిన కథ నచ్చగానే నన్ను నమ్మి బి. పి. ఆర్ బ్యానర్ లో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చాడు. సినిమా తీస్తున్నప్పుడు ఫారెస్ట్ లోకానీ ఇతర లొకేషన్స్ లో ఫైట్స్, పాటల విషయంలో ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.నన్ను నమ్మి ఇంత మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటి బిగ్ బాస్ ఫెమ్ శ్వేతా వర్మ  మాట్లాడుతూ.. కోవిడ్ టైమ్ లో చాలా సినిమాలు చేశాను. నేను బిగ్ బాస్ లో ఉన్నపుడు ప్రతాప్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు.ఈ సినిమాను మొదట ఓటిటి లో రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు.అయితే రామకృష్ణ గారు చూసి మంచి కంటెంట్ ఉన్న ఇలాంటి సినిమా థియేటర్ లో రిలీజ్ చేయాలని ముందుకు వచ్చాడు. ఇందుకు మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. నిర్మాతలు కోవిడ్ టైమ్ లో కూడా చాలా ప్రికాషన్స్ తీసుకొని ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు మంచి ఔట్  పుట్ వచ్చే వరకు మాతో వర్క్ చేసుకున్నాడు. ఇలాంటి మంచి దర్శకులు, నిర్మాతలు ఇండస్ట్రీ లో ఉండడం వలన ఎంతో మంది ఆర్టిస్టులకు ఉపాధి దొరుకుతుంది. ఈ నెల 8 న వస్తున్న మా చిత్రాన్ని మమ్మల్ని ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

Kondaveedu movie realese on 8th:

Kondaveedu is coming to the audience on 8th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ