Advertisementt

పొన్నియన్ సెల్వన్ రిలీజ్ డేట్ లాక్

Sat 02nd Jul 2022 05:48 PM
mani ratnam,ponniyin selvan,lyca productions,madras talkies  పొన్నియన్ సెల్వన్ రిలీజ్ డేట్ లాక్
PS-1 is slated for a worldwide release on September 30 పొన్నియన్ సెల్వన్ రిలీజ్ డేట్ లాక్
Advertisement
Ads by CJ

మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ప్రెస్టీజియస్‌ సినిమా పొన్నియిన్‌ సెల్వన్‌. లైకా ప్రొడక్షన్స్, మెడ్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా విడుదల కానుంది పొన్నియిన్‌ సెల్వన్‌. పీయస్‌-1ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్‌, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక సమయంలో విడుదల చేయనున్నారు. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. 1950ల్లో విడుదలై సెన్సేషనల్‌ సక్సెస్‌ అయినప్పటికీ జనాలను ఆకట్టుకుంటున్న కల్కి తమిళ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది.

పదో శతాబ్దానికి చెందిన సాహోసోపేతమైన అంశాలతో అల్లుకున్న నవల పొన్నియిన్ సెల్వన్‌. చోళుల సామ్రాజ్యంలో చోటుచేసుకున్న ఎన్నో అంశాల సమాహారంగా తీర్చిదిద్దారు. తదనంతర కాలంలో రాజరాజచోళుడిగా కీర్తి పొంది, భారత దేశ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన పొన్నియిన్‌ సెల్వర్‌ (కావేరి నది పుత్రుడు) పేరుతో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఆయన రాజ్యాధికారం స్వీకరించడానికి ముందున్న గందరగోళ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. శత్రువుల కోసం పనిచేసిన అస్మదీయుల గురించి కూడా ప్రస్తావిస్తుంది.

PS-1 is slated for a worldwide release on September 30:

Mani Ratnam Ponniyin Selvan produced jointly by Lyca Productions and Madras Talkies is getting ready to hit the screens in two instalments.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ