యాక్షన్ హీరో గోపీచంద్, విలక్షణ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మారుతి కాంబినేషన్ లో వచ్చిన సినిమా పక్కా కమర్షియల్. టైటిల్ కు తగ్గట్టుగానే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా గోపీచంద్ క్యారక్టరైజేషన్ ప్రేక్షకులకు బాగా చేరువవుతుంది. అలాగే రాశి ఖన్నా పెర్ఫార్మెన్స్ కడుపుబ్బ నవ్విస్తోంది. ఆమె క్యారెక్టర్ ను దర్శకుడు మారుతి డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. థియేటర్స్ లో కొన్ని సన్నివేశాలు వస్తున్నప్పుడు ఈలలు గోలలతో ఎంజాయ్ చేస్తున్నారు. దానికి తోడు పాజిటివ్ మౌత్ పబ్లిసిటీ కూడా సినిమాకు హెల్ప్ అవుతుంది.
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కమర్షియల్ అంశాలతో చాలా బాగుంది అంటున్నారు. సినిమాకు ఇదే చాలావరకు కలెక్షన్స్ పెరగడానికి హెల్ప్ అవుతుంది అని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. మొదటిరోజు ఈ సినిమాకు 6.3 కోట్ల గ్రాస్ వచ్చింది. గోపీచంద్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా పక్కా కమర్షియల్ కావడం గమనార్హం. ఈ వీకెండ్ ముగిసేసరికి మరింత అద్భుతమైన విజయం వైపు పక్కా కమర్షియల్ అడుగు వేసేలా కనిపిస్తోంది. సినిమాలో మారుతి డిస్కస్ చేసిన సీరియస్ అంశం కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది.