Advertisementt

నేను పని చేసిన బెస్ట్ డైరెక్ట‌ర్స్‌లో ఈయన ఒకరు

Thu 23rd Jun 2022 04:15 PM
ram,the warrior movie,the warrior movie song launch,krithi shetty  నేను పని చేసిన బెస్ట్ డైరెక్ట‌ర్స్‌లో ఈయన ఒకరు
The Warrior Movie Song Launch నేను పని చేసిన బెస్ట్ డైరెక్ట‌ర్స్‌లో ఈయన ఒకరు
Advertisement
Ads by CJ

ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని కనిపించనున్న సినిమా ది వారియర్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. 

సినిమాలో విజిల్ సాంగ్‌ను బుధవారం ప్రముఖ కథానాయకుడు సూర్య ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో లిరికల్ వీడియో ప్రదర్శించారు. 

రామ్ పోతినేని మాట్లాడుతూ లాస్ట్ సినిమా 50 శాతం అక్యుపెన్సీలో చూశా. ఇప్పుడు థియేటర్‌లో 100 శాతం ఆక్యుపెన్సీ చూస్తుంటే అదిరిపోయింది. మంచి ఫీల్ వచ్చింది. నాకు ఇప్పుడు లాక్‌డౌన్‌ తీసినట్టుంది. విజిల్ వేసే బాధ్యత మీది (ప్రేక్షకులను ఉద్దేశిస్తూ)... వేయియించాల్సిన బాధ్యత నాది. మేం అడిగిన వెంటనే సాంగ్ విడుదల చేసిన సూర్య గారికి థాంక్స్. ముందుగా... దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడాలి. బుల్లెట్... సాంగ్‌తో స్టార్ట్ చేశాడు. అది ఇంకా రన్ అవుతుంది. ఎక్కడా ఆగడం లేదు. ఈ రోజే విడుదల చేశామా అన్నట్టు ట్రెండ్ అవుతోంది. సౌత్ ఇండియా అంతా షేక్ చేస్తోంది. విజిల్ సాంగ్‌కు కూడా సూపర్ డూపర్ హిట్ ట్యూన్ ఇచ్చాడు. నెక్స్ట్ సాంగ్స్ కూడా విన్నాను. షూట్ చేశాడు. బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. నా మీద తనకు ఉన్న ప్రేమను పాటల్లో చూపిస్తాడు డీఎస్పీ. నా కెరీర్ అంతా చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చాడు. విజిల్ సాంగ్ షూట్ చేసేటప్పుడు ది వారియర్ అనే టైటిల్ ఎందుకు పెట్టామో అర్థం అయ్యింది... చాలా ప్రాబ్లమ్స్ వచ్చినా సాంగ్ ఫినిష్ చేయాలని చేశాం. రంజాన్ సమయంలో ఉపవాసం చేస్తూ జానీ మాస్టర్ సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. వేరే షూటింగ్ ఉన్నప్పటికీ... మేనేజ్ చేసి డేట్స్ అడ్జస్ట్ చేసి కృతి ఈ సాంగ్ చేసింది. ఈ సినిమాలో మాస్ కృతిని చూస్తారు. ఫుడ్ పాయిజన్ అయ్యి రెండు రోజులు ఆస్పత్రిలో ఉన్నప్పటికీ... సుజీత్ లైటింగ్ దగ్గరనుంచి ప్రతి విషయంలో కేర్ తీసుకున్నారు. దర్శకుడు లింగుస్వామి గారు ప్రతి ఫ్రేమును ఆయన భుజాలపై మోశారు. అద్భుతంగా సినిమా తీశారు. నేను పని చేసిన బెస్ట్ డైరెక్ట‌ర్స్‌లో ఆయన ఒకరు. ది వారియర్ కు మంచి టీమ్ కుదిరింది. టీమ్ వర్క్ సినిమాలో చూస్తారు. ఇక, విజిల్ సాంగ్ గురించి ఒక్కటే చెబుతా... ఇది టిక్ టాక్ సాంగ్ కాదు, థియేటర్ సాంగ్. థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి. అభిమానుల కోసం సినిమాలో చాలా ఉన్నాయిఅని అన్నారు.  

కృతి శెట్టి మాట్లాడుతూ ప్రేక్షకులు విజిల్స్ వేస్తున్నారు. అయితే... వాళ్ళను చూస్తుంటే నాకు విజిల్ వేయాలనిపిస్తోంది. రామ్ గారు ఉంటే సినిమాలో ఒక ఎనర్జిటిక్ సాంగ్ ఉండాలి. ఆయన పెర్ఫార్మన్స్ చూడటం కోసం! విజిల్ మహాలక్ష్మి కోసం ఒక విజిల్ సాంగ్ సిట్యువేషన్ క్రియేట్ చేసినందుకు లింగుస్వామి గారికి థాంక్స్. ఉప్పెన తర్వాత డీఎస్పీ గారితో నేను చేస్తున్న చిత్రమిది. సూపర్ సాంగ్స్ ఇచ్చారు. ఉప్పెనలో సాంగ్స్ పెద్ద హిట్. ది వారియర్ ఫస్ట్ సాంగ్ విడుదలైనప్పుడు ఆల్బమ్ పెద్ద హిట్ కావాలని కోరుకున్నాను. హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. జానీ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. బుల్లెట్ సాంగ్‌లో విజువల్స్ చూశారు. అందులో ప్రొడక్షన్ వేల్యూస్ తెలుస్తాయి. బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ప్రొడక్షన్ వేల్యూస్ ఇంకా బాగా తెలుస్తాయి. మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు అని అన్నారు. 

దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని పదేళ్ల నుంచి ఆలోచిస్తూ ఉన్నాను. హీరోలు, నిర్మాతలను కలిశాను. అప్పుడు జరగలేదు. ది వారియర్, ఈ టీమ్ కోసమే వెయిట్ చేస్తున్నాని తర్వాత అర్థమైంది. మా హీరో రామ్ గారి ఎనర్జీ, డీఎస్పీ ఎనర్జీ, నా ఎనర్జీ, మా టీమ్ అందరి ఎనర్జీ ఒకే లెవెల్‌లో ఉంది. మీకు విజిల్ సాంగ్‌లో కనపడి ఉంటుంది. అద్భుతమైన సందర్భంగా ఈ పాట వస్తుంది. సాంగ్ వచ్చేటప్పుడు ప్రేక్షకులు అందరూ పెద్ద పెద్ద విజిల్స్ వేస్తారని అనుకుంటున్నాను. బుల్లెట్.. సాంగ్ విడుదల తర్వాత ఒక రెస్టారెంట్‌కు మా పిల్లలు బుల్లెట్ సాంగ్ పెడితేనే తింటారు సార్. మీ సాంగ్ అంత పెద్ద హిట్ అని తల్లిదండ్రులు చెప్పారు. షార్ట్ వీడియోస్ లో 900 కోట్ల మంది బుల్లెట్ సాంగ్ చేశారు. త్వరలో వెయ్యి కోట్ల మార్క్ చేరుకోవచ్చు. బాహుబలి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. నా సాంగ్ షార్ట్ వీడియోస్ రూపంలో వెయ్యి కోట్లు చేరుకుంది. ప్రేక్షకుల ఆశీర్వాదంతో సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి సాంగ్స్, సినిమా కోసం ఏం అడిగితే అది ఇచ్చారు. మమ్ముట్టి గారితో మొదలు పెడితే... మాధవన్, సూర్య, విక్రమ్, అజిత్ వంటి మంచి హీరోలతో నేను పని చేశాను. రామ్ స్పెషాలిటీ ఏంటంటే... స్కిప్ట్ విన్న రోజు నుంచి సినిమా కంప్లీట్ అయిన తర్వాత చూసే వరకూ ఎనర్జీ లెవల్ ఎక్కడా తగ్గలేదు. ఆయన నెక్స్ట్ లెవల్ హీరో. అది నాకు తెలుస్తుంది. త్వరలో మీకు తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ అన్ని హిట్ సాంగ్స్ ఇచ్చారు. మా సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, ప్రొడక్షన్ డిజైనర్ సత్యనారాయణ, సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవన్, విజిల్ తెలుగు పాటకు సాహిత్యం అందించిన సాహితి, విజిల్ తమిళ పాటకు సాహిత్యం అందించిన వివేక్ తదితరులు పాల్గొన్నారు. 

The Warrior Movie Song Launch:

Ram The Warrior Movie Song Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ