Advertisementt

గ్యాంగ్‌స్టర్ గంగరాజు కు U/A సర్టిఫికెట్

Wed 15th Jun 2022 08:36 PM
laksh,gangster gangaraju,laksh chadalavada,vedika dutt,vennela kishore,chadalavada brothers  గ్యాంగ్‌స్టర్ గంగరాజు కు U/A సర్టిఫికెట్
Gangster Gangaraju Received U/A Certificate గ్యాంగ్‌స్టర్ గంగరాజు కు U/A సర్టిఫికెట్
Advertisement
Ads by CJ

హీరో లక్ష్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ గ్యాంగ్‌స్టర్ గంగరాజు సెన్సార్ పూర్తి, వైవిధ్యభరితమైన కథలతో రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా స్టోరీలను ఎంచుకుంటూ తెలుగు తెరపై గుర్తింపు తెచ్చుకున్నారు హీరో లక్ష్. వలయం సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న ఆయన.. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయింది. 

గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమా చూసిన సెన్సార్ సభ్యులు  ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.  ఇటీవలే విడుదల చేసిన గ్యాంగ్‌స్టర్ గంగరాజు ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసింది. ఈ వీడియోకి నెట్టింట భారీ ఆదరణ దక్కింది.  

వాడిప్పుడొక రక్తం మరిగిన పులి లాంటోడు.. గ్యాంగ్ స్టర్ కా గాడ్ ఫాదర్ అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమా ఎంత పవర్ ఫుల్ సబ్జెక్టుతో రానుందో స్పష్టం చేసింది. లక్ష్ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ చూపించిన సన్నివేశాలు ఈ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. జూన్ 24న ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఘనంగా విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు వదిలిన అన్ని అప్‌డేట్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ మూవీపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రంలో వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌ న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.

Gangster Gangaraju Received U/A Certificate:

Gangster Gangaraju Movie Completed Censor

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ