Advertisementt

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ పాటకు మిలియన్ వ్యూస్

Sat 11th Jun 2022 01:22 PM
mr. work from home,mr. work from home movie,mr. work from home movie song  మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ పాటకు మిలియన్ వ్యూస్
Mr. Work from Home movie song Release మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ పాటకు మిలియన్ వ్యూస్
Advertisement
Ads by CJ

బర్త్ డే సందర్భంగా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ హీరో త్రిగున్ కు మిలియన్ వ్యూస్ కానుక!

వెన్నెలే వెన్నెలే నాలో వెల్లువై పొంగెలే పాటకు అద్భుతమైన స్పందన. లోటస్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి మధుదీప్ సి.హెచ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సాఫ్ట్వేర్ టర్నెడ్ ఇంజినీర్ అరవింద్.ఎమ్ నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. త్రిగున్-పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లు. ఈ చిత్రం నుంచి వెన్నెలే వెన్నెలే నాలో వెల్లువై పొంగెలే నిన్నలో మొన్నలో లేని వన్నెలే పూచెలే" అనే పల్లవితో సాగే సాంగ్ ను లాంచ్ చేశారు. ఈ పాటకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది!

ఒకే ఒక లోకం నువ్వే.. పాటతో సంచలనం సృష్టించిన అరుణ్ చిలువేరు సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాటకు ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ సాహిత్యం సమకూర్చగా ఎన్.సి.కారుణ్య ఆలపించారు. సరెగమ మ్యూజిక్ ఈ చిత్రం ఆడియో హక్కులు సొంతం చేసుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. జూన్ 8, హీరో త్రిగున్ పుట్టినరోజును పురస్కరించుకుని మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ మోషన్ పోస్టర్ కు తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ అందించడం విశేషం. రుచులలో రారాజు ఆవకాయలాంటి మాధుర్యాన్ని పంచగలిగే ఛందస్సును గుర్తుచేస్తూ, పద సంయోగపు మధురిమలను పంచే ప్రయత్నమే ఈ పాట అన్నారు నిర్మాత అరవింద్. పాటకు లభించిన మిలియన్ వ్యూస్ తమ హీరోకు బర్త్ డే కానుకగా అందిస్తున్నామని దర్శకుడు మధుదీప్ పేర్కొన్నారు!

అనీష్ కురువిల్లా, సత్యకృష్ణన్, సి.వి.ఎల్.నరసింహారావు, జయశ్రీ రాచకొండ, వివా హర్ష, గుండు సుదర్శన్, నెల్లూరు సుదర్శన్, గిరిధర్, జబర్దస్త్ వేణు, ఇందు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఆర్ట్: శివ, కాస్ట్యూమ్స్: కావ్య, మేకప్: బాబు మనుకొండ, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: పవన్ కొడాలి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరావు, డి.ఓ.పి: రవి.వి, మ్యూజిక్: అరుణ్ చిలువేరు, ప్రొడ్యూసర్: అరవింద్.ఎమ్, దర్శకత్వం: మధుదీప్ సి.హెచ్.

Mr. Work from Home movie song Release:

Million views for Mr. Work from Home movie song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ