Advertisementt

కథ పూర్తయ్యాకే హీరో సెలక్షన్: శశికిరణ్ తిక్క

Thu 09th Jun 2022 08:57 AM
sashi kiran tikka,sashi kiran tikka interview,major success  కథ పూర్తయ్యాకే హీరో సెలక్షన్: శశికిరణ్ తిక్క
Sashi Kiran Tikka Interview కథ పూర్తయ్యాకే హీరో సెలక్షన్: శశికిరణ్ తిక్క
Advertisement
Ads by CJ

గూఢచారి సినిమాతో స‌క్సెస్ పుల్ ద‌ర్శ‌కుడిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టిన శ‌శికిర‌ణ్ తిక్క  మేజ‌ర్ తో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.  మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవితం తెర‌మీద ఆవిష్క‌రించ‌డంలో అత‌ను చూపిన ప్ర‌తిభ కు అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌తో పాటు అన్ని ఇండ‌స్ట్రీ నుండి ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ను మ‌ల‌చ‌డంలో శ‌శికిర‌ణ్ చూపిన మెచ్యూరిటీని ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు.  నిర్దిష్ణ మైన ప్ర‌ణాళిక‌తో , చెక్కుచెద‌ర‌ని ఆత్మ విశ్వాసంతో శ‌శికిర‌ణ్ చేసిన ప్ర‌యాణం ఇప్ప‌డు  అత‌న్ని దేశం గుర్తించిన ద‌ర్శ‌కుడిగా మ‌లిచింది.  ఒక క‌థ‌ను అర్ధం చేసుకోవ‌డంలో ద‌ర్శ‌కుడిగా అత‌నికున్న విజ‌న్ గొప్ప‌ద‌నం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందుతుంది.  క‌థ‌లోని సెన్సిబిలిటీస్ ని తెర‌మీద‌కు అంతే హృద్యంగా తీసుకురావ‌డం అత‌ని ప్ర‌త్యేక‌త‌గా క‌న‌ప‌డుతుంది.  మేజ‌ర్ సందీప్ జీవితం లో 26/11 ఉగ్ర‌దాడులు అంద‌రికీ తెలిసిన సంఘ‌ట‌నే.. కానీ అత‌ని జీవితం అది మాత్ర‌మే కాదు. అంత బ‌ల‌మైన వ్య‌క్తిత్వ నిర్మాణం వెనుక ఉన్న పునాదుల‌ను ప‌రిచ‌యం చేయ‌డంలో శ‌శికిర‌ణ్ పూర్తిగా విజ‌యం సాధించారు. అందుకే  సందీప్ క‌థ ఇంత ఎమోష‌న‌ల్ గా అవ‌డానికి అత‌ని త్యాగం మాత్ర‌మే కార‌ణం కాదు అత‌ని జీవితం కూడా.  ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు చూపిన ప‌రిణితి ఇప్ప‌డు అత‌ని స్థానాన్ని ప్ర‌త్యేకంగా నిలిపింది.  ఐఎండిబి రేటింగ్ లో  9.3 సాధించింది.   ఈ సినిమా కు ప్రేక్ష‌కులు విలువ క‌ట్ట‌లేని గౌర‌వాన్ని అందించారు.  కొంద‌రి  జ్ఞాప‌కాల్లో మాత్ర‌మే మిగిలిన సందీప్ ఉన్ని కృష్ణ‌న్ జీవితాన్ని మ‌రింత మందికి చేరువ చేసి అత‌ను ర‌గ‌ల్చిన స్పూర్తిని మాత్రం గుండెల్లో నింపారు  ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్.  ద‌ర్శ‌కుడిగా మ‌లి ప్ర‌య‌త్నంతోనే అరుదైన గౌర‌వం పొందిన ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్క. మేజర్ ఘన విజయం సాధించిన సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఆయన మాట్లాడుతూ..

 మేజర్ సినిమాకు వస్తున్న స్పందన ఎంతో సంతృప్తిని ఇస్తోంది. గౌరవాన్ని తెచ్చి పెట్టి గర్వంగా ఫీలయ్యే సినిమా చేశాం. తెలుగులో అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. బాలీవుడ్ లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. విక్రమ్, పృథ్వీరాజ్ చిత్రాలతో చూస్తే మాది చిన్న చిత్రం. అయినా వాటితో పాటే ఆదరణ పొందుతోంది. 

- మంచి సినిమా చేస్తామని మేజర్ సందీప్ తల్లిదండ్రులకు మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్నామనే సంతోషం మిగిలింది. బాలీవుడ్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా అప్రిసియేషన్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్, రానా వంటి హీరోలు ఫోన్స్ చేసి సినిమా చాలా బాగా చేశారు అని మెచ్చుకుంటున్నారు. ఇవన్నీ నేను మర్చిపోలేని జ్ఞాపకాలు. మేజర్ సినిమా  ప్రివ్యూ చూశాక సందీప్ వాళ్ల మదర్ నన్ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. మేము ఎంత నిజాయితీగా పనిచేశామో ఆమె స్పందన ద్వారా తెలిసింది. 

- మేజర్ సినిమా వాస్తవానికి 2020 లోనే విడుదల అవ్వాలి. 40 పర్సెంట్ షూటింగ్ కేవలం 3 నెలల్లో పూర్తి చేశాం. అదే వేగంతో చేసుకుంటూ వెళ్తే సినిమా వేగంగా ఫినిష్ అయ్యేది. ఇంతలో లాక్ డౌన్ వచ్చి పడటం వల్ల సినిమా ఆపేయాల్సి వచ్చింది. తిరిగి షూటింగ్ మొదలుపెట్టే టైమ్ కు ప్రకాష్ రాజ్, రేవతి వంటి పెద్ద ఆర్టిస్టుల డేట్స్ దొరకలేదు. డబ్బింగ్ సహా మొత్తం పనులన్నీ అలా స్ట్రగుల్ పడి కంప్లీట్ చేశాం.

- మేజర్ చిత్రాన్ని మేము నిజాయితీగా తెరకెక్కించాం. కమర్షియాలిటీ కోసం కావాలంటే పాటలు, ఫైట్స్ పెట్టొచ్చు. కానీ మేము ఎక్కడా ఆ లైన్ క్రాస్ కాలేదు. కథను ఎంత హుందాగా, సహజంగా తెరకెక్కించాలో అదే పద్ధతిలో రూపొందిస్తూ వెళ్లాం.

- అడివి శేష్ తో నాకు మంచి స్నేహం ఉంది. గూఢచారి సినిమా చేసినా, మేజర్ కి పనిచేసినా ఇద్దరం కలిసే వర్క్ చేశాం. నాకు పేరు కంటే సంతృప్తి, గొప్ప సినిమా చేశామనే సంతోషం ముఖ్యం. ఆ రెండూ నాకు దక్కాయి. నాకే పేరు రావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. నా సినిమాకు మంచి పేరొస్తే నాకొచ్చినట్లే కదా. గూఢచారి, మేజర్ సినిమాలో ఏ అంశానికి పేరొచ్చినా అందులో దర్శకుడిగా నాకూ భాగముంటుంది. ఏదైనా సినిమా అనేది ఒక కలెక్టివ్ ఎఫర్ట్. ఆ టీమ్ వర్క్ కు నేను గౌరవం ఇస్తాను. గూఢచారి 2 సినిమాకు నేను దర్శకత్వం వహించడం లేదు. కానీ ఆ సినిమా స్క్రిప్టు కానీ మరో క్రియేటివ్ విషయంలో గానీ నేను వాళ్లతో ఉంటాను. గూఢచారి శేష్ తో పాటు నా బ్రైన్ చైల్డ్. కుదిరితే గూఢచారి ఫ్రాంఛైజీలో మరో సినిమాకు దర్శకత్వం వహిస్తా.

- మేజర్ సినిమాకు వచ్చిన పేరు, ఈ సినిమా నాకు తీసుకొచ్చిన గుర్తింపుతో ఇక నేను చేయబోయే సినిమాలు కూడా ఇంతే జాగ్రత్తగా చేయాలనుకుంటున్నాను. ఈ పేరును కాపాడుకుంటూనే సినిమాలు రూపొందిస్తా. ఏ సినిమా చేసినా ఏదో ఒక మంచి కథను చెప్పాలని ఉంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో ఓ సినిమాకు ఒప్పందం కుదిరింది. ఈ సినిమా ఏ హీరోతో చేస్తాననేది ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే నేను ముందు కథను సిద్ధం చేసుకుంటా. కనీసం ఆరేడు నెలలు కథ మీద వెచ్చించాల్సి వస్తుంది. కథ పూర్తయ్యాక హీరోను సెలెక్ట్ చేసుకుంటా.

- ఇవాళ కొత్త దర్శకులకు ఇండస్ట్రీలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. సినిమా మీద ప్యాషన్ ఉండి, ఏదైనా మంచి కథ ఉంటే ఓటీటీల నుంచి, ప్రొడక్షన్ హౌస్ ల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. మీ దగ్గరకు అవకాశాలు రావు మీరే సృష్టించుకోవాలి. యంగ్ ఫిలింమేకర్స్ కు నేను ఇదే చెప్పాలనకుంటున్నా. మా టైమ్ లో ఇంత టెక్నాలజీ లేదు, ఓటీటీ వేదికలు లేవు, స్క్రిప్టు పట్టుకుని తిరగాల్సి వచ్చేది. ఇప్పటి వారికి ఎన్నో వేదికలు వస్తున్నాయి. 

- నిర్మాతలకు కూడా పెట్టుబడి రాబట్టుకునే మార్గాలు పెరిగాయి. అందుకే మళ్లీ ఇండస్ట్రీలోనే వారు ఉంటూ కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారు. అసలు పెట్టుబడి రాకుంటే ఎవరూ ఇక్కడ సినిమాలు చేయరు కదా.

- బ్రిటీష్ కాలపు నేపథ్యంతో ఓ సినిమా రూపొందించాలని ఉంది. మరికొన్ని కథలు ఐడియాల రూపంలో, చిన్న డ్రాఫ్ట్ లుగా ఉన్నాయి. నేను సినిమాల ఎంపికలో తొందరపడటం లేదు. కనీసం ఏడాదికి ఒకటైనా చేసుకుంటూ వెళ్లాలని అనుకుంటున్నాను.

Sashi Kiran Tikka Interview:

Sashi Kiran Tikka Interview about Major Success 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ