Advertisementt

మేఘ ఆకాష్ మాటే మంత్రము

Tue 07th Jun 2022 12:23 PM
megha akash,rahul vijay,maate mantramu  మేఘ ఆకాష్ మాటే మంత్రము
Megha Akash exciting film titled Maate Mantramu మేఘ ఆకాష్ మాటే మంత్రము
Advertisement
Ads by CJ

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమాకు మాటే మంత్రము అనే టైటిల్ ను ఖరారు చేశారు. రాహుల్ విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై  ఎ సుశాంత్ రెడ్డి,  అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా...అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట మాట్లాడుతూ...మా హీరో పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేస్తున్నాం. ఈ చిత్రానికి మాటే మంత్రము అనే పేరును ఖరారు చేశాం. ఇది మా సినిమాకు యాప్ట్ టైటిల్. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో, రెండో షెడ్యూల్ గోవాలో చిత్రీకరించాం. ప్రస్తుతం 90 శాతం షూటింగ్ పూర్తయింది. గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అన్నారు.

Megha Akash exciting film titled Maate Mantramu:

Megha Akash, Rahul Vijay exciting film titled Maate Mantramu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ