Advertisement

కువైట్ లో తమన్ సుస్వర తమనీయం

Mon 06th Jun 2022 07:35 PM
thaman,telugu kala samithi,telugu community,sri sai subbarao  కువైట్ లో తమన్ సుస్వర తమనీయం
Thaman is a musician of melodies in Kuwait కువైట్ లో తమన్ సుస్వర తమనీయం
Advertisement

రెండున్నర సంవత్సరాల తరువాత కోవిడ్ అనంతరం మొట్ట మొదటి సారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రత్యక్ష సంగీత కార్యక్రమం సుస్వర తమనీయం, మైదాన్ హవల్లీ లోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో, యువతను ఉర్రూతలూగిస్తున్న సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ యస్.యస్. తమన్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయని గాయకులు శ్రీ కృష్ణ, సాకేత్, పృథ్వి చంద్ర, విమల రోషిని, శ్రీ సౌమ్య, శృతి రంజని, మనీష, హరిక నారాయణ్ తది తరులు మరియు వాణిజ్య బృందంచే నిర్వహించ బడినది. జూన్ మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయం లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించ బడింది. ఈ మెగా ఇవెంట్ లో తెలుగు వారు దాదాపు 1500 మందికి పైగా పాల్గొన్నారు. వివిధ దేశాల తెలుగు సంస్ధల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం ప్రత్యేక ఆకర్షణగా  నిలిచింది.

ముఖ్య అతిధిగా విచ్చేసిన ఇండియన్ ఎంబసీ కమ్యూనిటీ ఎఫైర్స్ & అసోసియేషన్ ఫస్ట్ సెక్రటరీ శ్రీ కమల్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. కువైట్ లో ముప్పై నాలుగు సంవత్సరాలు ఘన చరిత్ర కలిగినటువంటి తెలుగు కళా సమితి తెలుగు సంస్కృతి సంప్రదాయ విలువలను కాపాడుతూ చేపడుతున్న ఎన్నో కార్యక్రమాలను ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేసారు.

తెలుగు కళా సమితి కార్యవర్గ అధ్యక్షులు శ్రీ సాయి సుబ్బారావు గారు మాట్లాడుతూ.. విచ్చేసిన ఇండియన్ ఎంబసీ ముఖ్య అతిధి శ్రీ కమల్ సింగ్ రాథోడ్ గారికి మరియు విరాళాలను ఇచ్చిన స్పాన్సర్ కి, శ్రీ ఎస్.ఎస్. తమన్ బృందానికి, తెలుగు కళా సమితి సభ్యులకు, సలహాదారులకు,ఎన్నికల సంఘానికి, మరియు అన్నింటికీ వెన్నంటి వుండి నడిపిన తమ కార్యవర్గ సభ్యులకు తమ కృతజ్ఞతలను మరియు అభినందనలను తెలిపారు కార్యక్రమ విశేషాలు, మునుపటి కార్యక్రమాలను క్లుప్తంగా తెలియ పరిచారు.తెలుగు వారి మనసుల్లో పాటల రూపంలో మనసును ఆయన స్వరంతో సేదతీరుస్తూ చిరస్థాయిగా నిలిచిపోయిన శ్రీ. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారికి మరియు పలుకులనే బాణాలుగా చేసి మన గుండెలకు సంధించి వాటిలో మైమరచిపోయేలా చేసిన అద్భుతమైన కవి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి తెలుగు కళా సమితి సభ్యులందరు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కమిటీ సభ్యులకు, దాతలుమరియు ప్రకటన కర్తలకు, తమన్ మరియు వారి బృందానికి, లేడీస్ వింగ్, వాలంటీర్స్, సలహాదారుల కమిటి మరియు ఆటపాటలతో అలరించిన పిల్లలకు, పెద్దలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి తమ అభినందనలను ధన్యవాదములను తెలిపారు. 

Thaman is a musician of melodies in Kuwait:

Telugu Kala Samithi is the only large Telugu community two Telugu states in Kuwait

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement