Advertisementt

హీరో నాని ఇంటర్వ్యూ

Mon 06th Jun 2022 05:54 PM
hero nani,hero nani interview,ante sundaraniki movie,nani interview about ante sundaraniki  హీరో నాని ఇంటర్వ్యూ
Hero Nani interview హీరో నాని ఇంటర్వ్యూ
Advertisement

అంటే సుందరానికీ జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యం లో హీరో నాని మీడియాతో అంటే సుందరానికీ విశేషాలు పంచుకున్నారు. ఆయన పంచుకున్న చిత్ర విశేషాలివి.

దర్శకుడు వివేక్ ఆత్రేయతో ప్రయాణం ఎలా అనిపించింది ? ఆయన కథ చెప్పినపుడు మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి ?

చాలా మంది రెండు, మూడు సినిమాలు చేసిన దర్శకులతో సినిమా ఎందుకని అడుగుతుంటారు. వివేక్ ఆత్రేయని కలసినప్పుడు, ఆయన కథ చెప్పినపుడు, పని చేస్తున్నపుడు ఆయన ఫ్యూచర్ టాప్ డైరెక్టర్ అనే నమ్మకం బలంగా కలుగుతుంది. ఆయన రైటింగ్ డైరెక్షన్ అంత బావుంటాయి. ప్రజంట్ లీడింగ్ దర్శకులు కంటే ఫ్యూచర్ లీడింగ్ దర్శకుల జర్నీలో భాగం కావడం ఒక ఆనందం. నేను చూసిన దర్శకుల్లో వివేక్ ఒక జెమ్. తనకంటూ ఒక ఒరిజినల్ స్టైల్ వుంది. ఇది తన ప్రతి సినిమాలో కనిపిస్తుంది. తన సినిమా కథని ఇంకెవరికి ఇచ్చినా తన లాగా తీయలేరు. వివేక్ లాంటి దర్శకుడితో పని చేయడం చాలా ఆనందం.

కొత్త దర్శకులకు ఒక బాడీ ఆఫ్ వర్క్ వుండదు కదా.. చెప్పింది తీస్తారా లేదా అనే సందేహం వుంటుంది కదా.. ఎలా జడ్జ్ చేస్తారు ?

గట్ ఫీలింగ్ అండీ. నేను కొత్తగా వున్నప్పుడు నాకూ బాడీ ఆఫ్ వర్క్ లేదు కదా. నన్ను నమ్మి చాలా మంది సినిమాలు తీశారు కాబట్టి బాడీ ఆఫ్ వర్క్ క్రియేట్ చేసుకొని ఈ రోజు ఇక్కడున్నాను. నేను కూడా అలాంటి ప్లాట్ ఫార్మ్ ప్రతిభ వున్న వారికి ఇవ్వాలి కదా. ప్రతిభ వుందనే నమ్మకం కుదిరితే ఇంకేం అలోచించను. భయపడను.

మీ కామెడీ టైమింగ్ అద్భుతంగా వుంటుంది కదా..  అంటే సుందరానికీ ఎలాంటి కొత్తదనం చూపించబోతున్నారు ?

అంటే సుందరానికీలో చాలా భిన్నమైన టైమింగ్ వుంటుంది. ఇప్పటి వరకూ ఇలాంటి టైమింగ్ వున్న పాత్ర చేయలేదు. నా పాత సినిమాల డైలాగ్ టెంప్లేట్ కి ఈ సినిమా ఎక్కడా మ్యాచ్ అవ్వదు. వివేక్ అలా మ్యాచ్ కాకుండా కొత్తగా రాసుకున్నాడు. నేను పాత నానిలా చేద్దామని అనుకున్నా చేయలేని విధంగా రాసుకున్నాడు. చాలా హిలేరియస్ గా వుంటుంది. కొత్త నాని, కొత్త టైమింగ్ చూస్తారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.

బ్రాహ్మణ కుర్రాడి పాత్ర పోషిస్తున్నారు కదా.. ప్రత్యేకంగా హోమ్ వర్క్ చేశారా ?

బ్రాహ్మణ పాత్రే కాదు కొన్ని పెక్యులర్ పాత్రలు నేపధ్యాలు ఇచ్చినపుడు కొంచెం ఎక్కువగా  డ్రమటైజ్ చేయడం కనిపిస్తుంటుంది.  కానీ అంటే సుందరానికీ అలా కాదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ సంప్రాదాయ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చారు. ఇందులో చాలా ప్రామాణికమైన వాతావరణం కనిపిస్తుంది. చిన్న చిన్న డిటేయిల్స్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి.  సినిమా చూస్తున్నపుడు మీరు కూడా పాత్రల మధ్యలో వున్నట్లు ఫీలౌతారు.

నరేష్ గారిది మీది మ్యాజికల్ కాంబినేషన్ ...అంటే సుందరానికీలో ఎలా ఉండబోతుంది ?

ఇప్పటివరకూ నేను నరేష్ గారితో చేసిన సినిమాలేవీ అంటే సుందరానికీ దగ్గరలో కూడా లేవు. ఇందులో  మా కాంబినేషన్ నెక్స్ట్ లెవల్ వుంటుంది.

మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు కదా.. ఏమైనా సమస్యలు ఎదురుకున్నారా ?

లేదండీ నాది చాలా హ్యాపీ మ్యారేజ్. ఇరు కుటుంబాలు చక్కగా మాట్లాడుకొని వివాహం జరిపారు. ఐతే వాళ్ళది సైంటిస్ట్ ల ఫ్యామిలీ. నేను సినిమాలు చుట్టూ  తిరుగుతున్నాను. మొదట్లో కొంచెం కంగారు పడ్డారు. ఐతే నాపై వాళ్ళకు నమ్మకం కుదిరి ఆనందంగా పెళ్లి జరిగింది.

లీలా పాత్ర నజ్రియా చేయాలనేది ఎవరి నిర్ణయం ?

నేను, వివేక్ ఇద్దరం అనుకున్నాం. లీలా పాత్ర అనుకున్నపుడు నజ్రియా లా వుండే హీరోయిన్స్ ఎవరు ? అనే వెదకడం మొదలుపెట్టాం. ఎవరూ కనిపించలేదు. నజ్రియా లాగా ఎందుకు నజ్రియానే అయితే ఎలా వుంటుందని భావించి ఆమెను సంప్రదించాం. అప్పటికే చాలా పెద్ద సినిమా ఆఫర్లకి కూడా ఆమె ఒప్పుకోలేదు. అయితే ఈ కథ విన్నవెంటనే నేను చేస్తా అని ఎగిరిగంతేసింది. లీలా పాత్రలోకి ఆమె రావడం ఆ పాత్రకు న్యాయం జరిగింది. ఫాహాద్ కూడా ఈ సినిమా గురించి చాలా ఎక్సయిటెడ్ గా వున్నారు. మొన్న కొచ్చి ప్రమోషన్స్ కి వెళ్ళినపుడు వాళ్ళ ఇంట్లోనే వున్నాం.

మీరు టికెట్ రేట్లు పెంచమని అడిగారు.. కానీ ఇప్పుడు నిర్మాతలే స్వతహాగా తగ్గిస్తున్నారు కదా ?

ఈ కామెంట్లు సోషల్ మీడియాలో నా వరకూ వచ్చాయి. అయితే ఇక్కడ ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. నేను టికెట్ రేట్లు పెంచమని చెప్పినపుడు సందర్భం వేరు. బేసిక్ రేట్లు కంటే బాగా తగ్గించి టికెట్ మరీ ముఫ్ఫై, నలభై రూపాయిలు చేసినప్పుడు.. ఇంత తక్కువ ధరతో సినిమా ఆడించడం కష్టం బేసిక్ రేట్లు పెట్టమని కోరాను. ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. నేను కూడా మిగతా సినిమాలకి రేట్లు పెంచమని అడగలేదు కదా. బేసిక్ రేట్లు కంటే తగ్గించేసినపుడు ఎవరూ బ్రతకలేరని చెప్పాను. నేనేం ఎక్కువ అడగలేదు. ముందువున్న బేసిక్ రేట్లు ఉంచమనే కోరాను.   

ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్   కానీ ఆ సందర్భం మర్చిపోయి ఇలా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు కదా.

అమెరికా వెళ్ళాలనే కోరిక వుండేదా ?

నా వరకైతే ఎప్పుడూ అనుకోలేదు. ఆ కోరిక కూడా వుండేది కాదు. కానీ  సుందర్ పాత్రకి మాత్రం ఆ కోరిక వుంది. అది ఎందుకనేది సినిమా చూస్తే మీకే అర్ధమౌతుంది. 

బారిష్టర్ పార్వతీశం నవలకు సుందర్ కి సంబంధం ఉందా ?

అస్సలు లేదు. అయితే  పంచెకట్టు మాత్రమే రిఫరెన్స్ గా తీసుకున్నాం. థియేటర్ లో ఆ సీన్ హిలేరియస్ గా ఉండబోతుంది.

తెలుగు సినిమా దేశ వ్యాప్తంగా ఆదరణ పొందుతుందా కదా? దిన్ని ఎలా చూస్తారు ?

నిజానికి ఇది గోల్డెన్ ఫేజ్. మనకే కాదు సినిమాకే మంచి ఫేజ్. సినిమా బావుంటే ప్రాంతానికి సంబంధం లేకుండా విజయం సాధిస్తుందంటే మంచి రోజులు వచ్చాయనే అర్ధం.

మైత్రీ మూవీ మేకర్స్ తో పని చేయడం ఎలా అనిపించింది ?

అద్భుతమైన సినిమాలు ప్రోడ్యుస్ చేస్తున్న లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్. చాలా మంచి సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. నవీన్ గారు, రవి గారు చాలా ప్యాషన్ వున్న నిర్మాతలు. గ్యాంగ్ లీడర్ తో మా జర్నీ మొదలైయింది. ఆ సినిమా మాస్ క్లాస్ అందరినీ ఆకట్టుకుంది. అంటే సుందరానికీ కూడా గొప్ప విజయం సాధిస్తుంద

పాన్ ఇండియా మార్కెట్ పెరుగుతుంది కదా .. ఆ  ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ?

నా ఉద్దేశంలో మన సినిమాని మనం పాన్ ఇండియా అనుకుంటే కాదు.. ప్రేక్షకులు అంటేనే పాన్ ఇండియా. కంటెంట్ బలంగా వుండాలి. పుష్ప సినిమా తీసుకుందాం.. సౌత్ అడవుల్లో జరిగిన కథ. నార్త్ తో ఆ కథకి సంబంధం లేదు. కానీ దేశం మొత్తం పుష్పని ఆదరించారు. పాన్ ఇండియా స్టేటస్ ఇచ్చారు. ముందు కంటెంట్ పై ద్రుష్టి పెట్టాలి తప్పితే మనకి మనమే పోస్టర్ పై పాన్ ఇండియా అని రాసుకోవడం సరికాదని నా ఉద్దేశం.

అంటే సుందరానికీ.. మరో చరిత్ర, సీతాకోక చిలుక సినిమాల ప్రభావం ఉందా ?

అస్సలు లేదండీ. అంటే సుందరానికీ చాలా రిఫ్రషింగ్ హార్ట్ వార్మింగ్ మూవీ.

దసరా ఎక్కడి వరకూ వచ్చింది ?

25శాతం షూటింగ్ పూర్తయింది. తెలుగులో వస్తున్న పవర్ ఫుల్ రా మూవీ ఇది.

మీ ప్రొడక్షన్ లో రాబోతున్న సినిమాలు ?

మీట్ క్యూట్ అనే సినిమా వస్తుంది. డైరెక్ట్ డిజిటల్. త్వరలోనే ప్రకటిస్తాం. అలాగే హిట్ 2. ఇది భారీ గా వుంటుంది. మేజర్ తో అడవి శేష్ హిట్ కొట్టారు. హిట్ 2ఏ మాత్రం తగ్గదు. ఈ ప్రాంచైజీ కొనసాగుతుంది.

Hero Nani interview:

Hero Nani interview about Ante Sundaraniki

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement