Advertisementt

అందరికి అందుబాటులో పక్కా కమర్షియల్

Sat 04th Jun 2022 01:35 PM
gopichand,pakka commercial,pakka commercial movie press meet  అందరికి అందుబాటులో పక్కా కమర్షియల్
Pakka Commercial Movie Press Meet అందరికి అందుబాటులో పక్కా కమర్షియల్
Advertisement
Ads by CJ

గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్’లో భాగంగా ఈ మూవీ టీం ప్రెస్ మీట్ ను నిర్వహించింది.  

టికెట్ ధరల గురించి ప్రస్తావిస్తూ నిర్మాత బన్నీ వాసు రేట్స్ అందుబాటులో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో అరవింద్ గారు, తాను మొదటి వ్యక్తులమని. నైజంలో 160+gst, ఆంధ్ర మల్టిఫ్లెక్స్ లో 150+gst, సింగిల్ స్క్రీన్ లో 100+gst అని చెప్పుకొచ్చారు. అందరు టికెట్ కోసం పెట్టిన డబ్బులకి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తారు అని చెప్పుకొచ్చారు.

హీరోయిన్ రాశిఖన్నా మాట్లాడుతూ తెలుగులో నా సినిమా రిలీజై చాలా రోజులు అయింది, మారుతి గారు ఏంజిల్ ఆర్నా కంటే చాలా చాలా మంచి కేరక్టర్ రాసారు. సినిమాలో చాలా మంచి  సీన్స్  ఉన్నాయ్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. గోపీచంద్ గారితో మూడు సినిమాలకి వర్క్ చేశాను చాలా హ్యాపీ గా ఉంది.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మొదటి కారణం యు.వి క్రియేషన్స్ వంశీ. నా నుంచి ఎటువంటి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారో వాటితో పాటు అన్ని మిక్స్ చేసి తీసిన కమర్షియల్ సినిమాలా ఉంటుందని హామీ ఇచ్చారు.

పక్కా కమర్షియల్ సినిమా ఓటిటిలో అంత త్వరగా రాదు, f3 సినిమా ప్రస్తుతం బాగా ఆడుతుంది, దానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా కూడా ఉండబోతుందని మెగా నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.

గోపిచంద్ మాట్లాడుతూ..నేను ఈ సినిమా చెయ్యడానికి  కారణం వంశీ, జిల్ తరువాత ఎప్పటినుంచో సినిమా చెయ్యాలనుకున్నాం కానీ మంచి కథ దొరకలేదు. కథ బాగా నచ్చడంతో, చేసేద్దాం అని ఫిక్స్ అయ్యాం. మారుతి తో షూటింగ్ స్టార్ట్ అవ్వగానే మాకు వేవ్ లెన్త్ బాగా కుదిరింది. ఒక పాజిటివ్ పీపుల్ కలిసి సినిమా చేసినప్పుడు దాని రిజల్ట్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ పక్కా కమర్షియల్.

Pakka Commercial Movie Press Meet:

Gopichand Pakka Commercial Movie Press Meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ