జులై 1న గోపీచంద్- మారుతీ కలయికలో క్రేజీ మూవీగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలోని అందాల రాశీ పాట విడుదలైంది. దీనికి మంచి అనూహ్య స్పందన వస్తుంది. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
అందాల రాశీ పాట లిరిక్స్
అందాల రాశీ మేకప్ వేసి.. నా కోసం వచ్చావే..
స్వర్గంలో కేసే నా మీద వేసి.. భూమ్మీద మూసావే..
నరనావకీలా పని నేర్పుతారా.. నను చేర్చుకోరా రెడీగా ఉన్నా రా..
ఫీ వద్దులేరా.. ఫేమస్సు కారా.. ఇక నా సేవ చేసేసుకో..
ఆగేటట్టుందే.. నా గుండె హిప్సే చూస్తుంటే..
ఏదీ గుర్తుకురాదే పాప పక్కన నువ్వుంటే.. (2)
అందాల రాశీ మేకప్ వేసి.. నా కోసం వచ్చావే..
బుల్లితెర నేనే.. బిగ్ స్టారును నేనే..
తెలుగిళ్లలోనే ప్రతి ఒక్కరు ఫ్యానే..
అన్నీ వదిలి వచ్చేసాను పోస్టే ఇచ్చుకో..
మోమాటాలు ఏవీ లేక ఫాలో చేసుకో..
మా బాగుందే నీ పేరు సూపర్ కుదిరిందే..
బ్లాక్ అండ్ వైట్ హాలుకు మొత్తం కలరింగ్ వచ్చిందే..
నా కండీషన్స్ అన్నీ నీకిష్టమైతే ఇక వచ్చేయ్ లేటెందుకే..
కాంబో కుదిరిందే.. మనిద్దరి కాంబో కుదిరిందే..
ఎండే లేని సీరియళ్లా వందేళ్లుండాలే.. (2)
అందాల రాశీ మేకప్ వేసి.. నా కోసం వచ్చావే..
స్వర్గంలో కేసే నా మీద వేసి.. భూమ్మీద మూసావే..
ఆగేటట్టుందే.. నా గుండె హిప్సే చూస్తుంటే..
ఏదీ గుర్తుకురాదే పాప పక్కన నువ్వుంటే.. (2)