పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, నేచురల్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం విరాటపర్వం. ఈ సినిమా జూలై 1న విడుదల కానుందని చిత్ర యూనిట్ ఇంతకూ ముందు డేట్ ప్రకటించింది. ఐతే ఇప్పుడా విడుదల తేది మరింత ముందుకు వచ్చింది. విరాట పర్వం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది.
1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రావన్న పాత్రను పోషించారు. సాయి పల్లవి, వెన్నెల పాత్రలో కనిపించనుంది. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా విరాట పర్వం ఉండబోతుంది.