ఏపీలో ప్రధాన రహదారులు అన్ని పసుపు మయమయ్యాయి. ఒంగోలు మొత్తం పసుపు జెండాలతో రెపరెపలాడింది. ఒంగోలు పట్టణంలో జరుగుతున్న టిడిపి మహానాడులో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంతో గంతులు వేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా వచ్చే ఎన్నికల్లో తనదే అధికారం అంటూ రెచ్చిపోతున్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏ మహానాడులోనూ ఒంగోలు మహానాడులో ఉన్నంత ఈ కసి చూడలేదని అంటున్నారు.
అంత ఘనంగా సక్సెస్ అయిన రెండు రోజుల మహానాడుపై వైసిపి శ్రేణులు విషం కక్కడమే కాదు, వాళ్ళకి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. దానితో ఓ మంత్రి గారు మహానాడును వల్లకాడుతో పోల్చారు. డిఫెన్స్ చేసుకోవడానికి వాళ్ళేం మాట్లాడుతున్నారో వారికే అర్ధం కావడం లేదు. వైసీపీ కి సపోర్ట్ చేసే సోషల్ మీడియా అకౌంట్స్ లో, కొన్ని వైసిపి వెబ్ సైట్స్ లో మహానాడు సక్సెస్ అవుతుంటే చూడలేక విషం కక్కుతున్నారు. టిడిపి మహిళా కార్యకర్తలు తొడకొడుతుంటే.. ఆడవాళ్లు తొడగొడితే టిడిపి మగవాళ్ళు ఏడుస్తారు అని, ఎప్పుడు విమర్శలేనా.. ఎజెండా ఎక్కడ బాబు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అటు పోలీస్ లు కూడా జనాలను మహానాడు ప్రాంగణానికి వెళ్లకుండా కార్ టైర్స్ లో గాలి తియ్యడం, కొన్ని కిలోమీటర్లు దూరంగా తెలుగు తమ్ముళ్ళని ఆపెయ్యడం వంటి కుట్రలు పన్నినా మహానాడుని తెలుగు తమ్ముళ్లు విజయవంతంగా నడిపించారు.. మరి నిజంగా చంద్రబాబు మహానాడు ముగింపు ప్రసగంలో మాట్లాడింది కరెక్ట్ అంటూ తెలుగు తమ్ముళ్లు జాతర చేస్తున్నారు.
చంద్రబాబు ఒంగోలు మహానాడు ముగింపు ప్రసంగం హైలైట్స్
యుద్ధం మొదలైంది..
జగన్ కేంద్ర చేతిలో కీలుబొమ్మగా మారారు..
పోలీసులూ జాగ్రత్తగా ఉండండి. నేను మీ గాలి కూడా తీస్తా..
వైసీపీ నేతలకు వెతలు.. టీడీపీ నేతలకు హారతులు..
టిడిపికి జనాలు ఉన్నారు.. వైసిపికి బస్సులు ఉన్నాయి..
వైసిపి మీటింగ్ లు వెలవెల.. మన మీటింగ్ లు కళకళ..
సభలో బందోబస్తుకు పోలీసులు ఎందుకు రాలేదు..
పోలీసులు అదుపు తప్పితే టిడిపినే అందరినీ సరి చేస్తుంది..
ఈ భారీ సభతో జగన్ కు పిచ్చెక్కుతుంది.. జగన్ కు మహానాడుతో నిద్రరాదు..
ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి. దీని కోసం ప్రతి జిల్లాలో మినీ మహానాడు.
కమిటీలు వేసి శతజయంతి కార్యక్రమం నిర్వహిస్తాం.
దేవుడు ఎలా ఉంటారు అంటే ఎన్టీఆర్ రూపంలో చూసుకుంటాం.
అఖండ సినిమాకు జగన్ ఇబ్బందులు పెట్టాడా లేదా.?
ప్రభుత్వ అడ్డంకులు ఉన్నా సినిమా బాగా ఆడింది.. అదీ నందమూరి బాలకృష్ణ
సినిమాలకు జగన్ అనుమతి ఇవ్వాలా
గడప గడపకూ వైసిపి అన్నారు.. తరువాత గడపగడపకూ ప్రభుత్వం అన్నాడు..
పోలీసుల రక్షణలో వెళ్లేందుకే కార్యక్రమం మార్చకున్నారు.
ఇప్పుడు బస్సు యాత్ర పెట్టుకున్నారు.. తరువాత గాలి యాత్ర పెట్టుకుంటారా.?
కరెంట్ చార్జీలు పెరిగాయా లేదా.. నిత్యావసరాలు కొనే పరిస్థితి ఉందా.?
ఒంగోలు మహానాడులో టీడీపీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.