Advertisementt

Thalapathy66 భారీ షెడ్యూల్ ఫినిష్

Thu 26th May 2022 07:18 PM
thalapathy66,vijay,vamsi paidipally,rashmika,dil raju,thaman  Thalapathy66 భారీ షెడ్యూల్ ఫినిష్
And it's a schedule wrap for Thalapathy66 Thalapathy66 భారీ షెడ్యూల్ ఫినిష్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - వంశీ పైడిపల్లి కాంబోలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్,  పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మ చిత్రం షూటింగ్ శరవేగంగా వేగంగా జరుగుతుంది. తాజాగా ప్రధాన తారాగణంతో 25 రోజుల పాటు చిత్రీకరించిన భారీ షెడ్యూల్‌ షూటింగ్ ని పూర్తి చేసింది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.   

విజయ్ 66 వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ రష్మిక మందన నటిస్తుంది. చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు షూటింగ్ పాల్గొన్నారు. చాలా మంది నటీనటులు సెట్స్‌కి వచ్చి షూట్‌లో పాల్గొనడంతో ప్రతిరోజూ ఒక పండగలా షూటింగ్ జరిగింది. 

ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. 

And it's a schedule wrap for Thalapathy66:

Thalapathy66 team had an awesome time shooting for important sequences in this schedule

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ