హుషారు లాంటి సూపర్‌హిట్ చిత్రం లో నటించిన తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్ వందెల దర్శకత్వం లో జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యం లో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు లు సంయుక్తంగా నిర్మిస్తున్నచిత్రం నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా. ఈ చిత్రానికి సంభందించి మొదటి లుక్ ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పడు ఈ చిత్రానికి సంభందించి మొదటి సాంగ్ ని విడుదల చేశారు. పుడిమిని తడిపే తొలకరి మొరుపుల చినుకమ్మా .. నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా అనే సాంగ్ ని విడుదల చేశారు. music director సందీప్ కుమార్ అందించిన ఈ సాంగ్ ని క్రేజి కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఈ సాంగ్ ని కొరియోగ్రఫి చేశారు. ఇటీవలే విడుదల చేసిన సాంగ్ ప్రోమో కి మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇప్పడు ఈ సాంగ్ ని ప్రముఖ నటులు , రచయిత, దర్శకులు తణికెళ్ళ భరణి గారు చేతుల మీదుగా లాంచ్ చేశారు.
ఈ సందర్బంగా తణికెళ్ళ భరణి గారు.. ఈ సాంగ్ నేను చూసాను, గణేష్ మాస్టర్ కొరియొగ్రఫి అంటే మాటలుండవ్ అలానే భవ్వ దీప్తి గారి సాహిత్యం కూడా చాలా బావుంది దర్శకడు వెంకట్ గారికి, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మల్లేటి నాగేశ్వరావు, నిర్మాతలు ముల్లెటి కమలాక్షి గుబ్బల వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేఖమైన శుభాకాంక్షలు. అలాగే ఈ సాంగ్ హీరొ తేజ, అఖిల లు చాలా అందంగా వున్నారు. ఈ చిత్రం మరింత విజయం సాధించాలని కొరుకుంటున్నాను. అన్నారు.
దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ.. పల్లెటూరి నేపధ్యం లో సాగే చక్కటి ప్రేమకథ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఈ చిత్రం ఫ్యామిలి మరియు యూత్ ని ఆకట్టకుంటుంది. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ లో ఈ సాంగ్ షూట్ చేశాము. తప్పకుండా అందర్ని ఆకట్టకుంటుంది. కంటెట్ నమ్మి మా నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమ కథ తో వినొదాన్ని మిక్స్ చేసి ఈ కథని తెరక్కించాము. ఇది మ్యూజికల్ ఎంటర్‌టైనర్ గా మంచి విజయాన్ని సాధిస్తుంది.ప్రముఖ నటులు తణికెళ్ళ భరణి గారు మా చిత్రం లో ఒ కీలక పాత్రలో నటించారు. అలాగే ఆయన చేతుల మీదుగా ఈ సాంగ్ విడుదల చేసినందుకు చాలా ఆనందంగా వుంది. అని అన్నారు.
నిర్మాత ముల్లేటి నాగేశ్వరావు మాట్లాడుతూ.. తేజ్ కూరపాటి, ఆఖిల ఆకర్షణ లు జంటగా నటించిన మా చిత్రం నుండి సాంగ్ ని విడుదల చేశాము. ఈ సాంగ్ ని ప్రముఖ నటులు తణికెళ్ళ భరణి గారు చేతుల మీదుగా విడుదల చేశాము. ఈ సాంగ్ ని కొరియోగ్రఫి చేసిన గణేష్ మాస్టర్ కి ప్రత్యేఖ ధన్యవాదాలు. ఈ చిత్రం చక్కటి ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు