Advertisementt

అఫీషియల్: విజయ్-వంశీ కాంబో సంక్రాంతికే

Tue 10th May 2022 06:14 PM
vijay,vamsi paidipally,dil raju,pvp big movie,thalapathy66 2023 sankranthi grand release  అఫీషియల్: విజయ్-వంశీ కాంబో సంక్రాంతికే
Vijay - Vamsi Paidipally Movie 2023 Sankranthi Release అఫీషియల్: విజయ్-వంశీ కాంబో సంక్రాంతికే
Advertisement
Ads by CJ

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్  పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మికా మందన్న, విజయ్ సరసన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  

విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భారీతారాగణం కనువిందు చేయనుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలలో సీనియర్ స్టార్లు శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ  కనిపించనున్నారు. వీరితో పాటు.. శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ఇతర కీలక పాత్రలలో సందడి చేయనున్నారు. 

 అలాగే ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

Vijay - Vamsi Paidipally Movie 2023 Sankranthi Release:

Thalapathy Vijay, Vamshi Paidipally film to release on Sankranthi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ