Advertisementt

సింగర్స్ గా విష్ణు మంచు కుమార్తెలు

Mon 09th May 2022 03:03 PM
vishnu manchu,gali nageshwara rao,ariaana and viviana  సింగర్స్ గా విష్ణు మంచు కుమార్తెలు
Vishnu Manchu daughter turns singers సింగర్స్ గా విష్ణు మంచు కుమార్తెలు
Advertisement
Ads by CJ

 డైనమిక్ స్టార్ విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు విష్ణు. ఈ క్యారెక్టర్ రివీల్ చేసినప్పట్నుంచి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ వంటి తారలు యాడ్ అవ్వడం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ సినిమాలోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తుండటం ఈ సినిమాకి మరో హైలైట్. తాజాగా మరో స్పెషల్ అట్రాక్షన్ ఈ సినిమాకి యాడ్ అయ్యింది. అదేంటంటే...

డా.మంచు మోహన్ బాబు గారి మనవరాళ్లు, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా ఈ సినిమా ద్వారా సింగర్స్ గా పరిచయం అవుతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాలోని ఓ పాటను అరియానా, వివియానా పాడటం విశేషం. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించారు. సినిమాకి కీలకంగా నిలిచే ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ సినిమా విషయంలో విష్ణు మంచు తీసుకుంటున్న కేర్, సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేస్తున్నాయి. 

Vishnu Manchu daughter turns singers :

Vishnu Manchu daughter turns singers for his next Gali Nageshwara Rao

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ