Advertisementt

నా నిన్నలలో కన్నులలో సాంగ్ క్యూట్ గా ఉంది -సందీప్ కిషన్

Sun 08th May 2022 11:43 AM
richie gaadi pelli,reche gaadi pelli movie,richie gadi pelli movie,richie gaadi pelli second song,sandeep kishan  నా నిన్నలలో కన్నులలో సాంగ్ క్యూట్ గా ఉంది -సందీప్ కిషన్
The second song from the Richie Gaadi Pelli నా నిన్నలలో కన్నులలో సాంగ్ క్యూట్ గా ఉంది -సందీప్ కిషన్
Advertisement
Ads by CJ

కె ఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ నుండి రిచి గాడి పెళ్లి చిత్రం నుండి రెండో సాంగ్ ప్రముఖ నటుడు సందీప్ కిషన్ చేతుల మీదుగా విడుదల అయ్యింది. శ్రీమణి రాసిన నా నిన్నలలో కన్నులలో అనే పాటకు  లిరిక్స్ అందించారు. మంచి రెస్పాన్స్ కూడా లభిస్తుంది. శక్తిశ్రీ గోపాలన్ గారు మరియు సత్యన్  గారు ఈ పాటని పాడారు.. అలాగే ఈ చిత్రంలో పాడిన, నా నిన్నలలో కన్నులలో అనే పాట పై ప్రముఖ నటుడు సందీప్ కిషన్ ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా ప్రముఖ నటుడు సందీప్ కిషన్ మాట్లాడుతూ, రిచిగాడి పెళ్లి లోని రెండో సాంగ్ నా నిన్నలలో కన్నులలో చూశాను. శక్తిశ్రీ గోపాలన్ మరియు సత్య  గారు ఇద్దరు  ఏక్స్ట్రార్డినరీగా పాడారు. సాంగ్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. విజువల్ ట్రీట్ లా అనిపించింది. క్యూట్ ఆండ్ స్వీట్ సాంగ్. సినిమాటోగ్రఫి పనితనం కూడా చాలా బాగుంది. విషింగ్ డైరక్టర్ హేమ్రాజ్ గారు అండ్ టీమ్ ఆల్ ద బెస్ట్. కె యెస్. హేమ రాజ్ గారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఒక సృజనాత్మక.  మనం చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది. ఆ చిన్న ఆట వల్ల, వాళ్ళ జీవితాలు ఎలా మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం. మీ అందరికి కచ్చితంగా నచ్చుతుంది.  అని అన్నారు.

దర్శకుడు కె యెస్ .హేమరాజ్ మాట్లాడుతూ.. రిచి గాడి పెళ్లి అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. ముఖ్యంగా లిరిక్ రైటర్ శ్రీమణి రాసిన  పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రముఖ నటుడు సందీప్ కిషన్ గారు పాట చాలా బాగుందని మెచ్చుకున్నారు. వారికి మా కృతజ్ఞతలు. ఇంత మంచి పాట అందించిన శ్రీమణి గారు కు, సింగర్స్ కు ధన్యవాదాలు. మా డిఓపి విజయ్ ఉలగనాథ్ గారు చేసిన వర్క్ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే చిత్రానికి పనిచేసిన బృందం మొదలు తారాగణం వరకు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు.

The second song from the Richie Gaadi Pelli:

 The second song from Richie Gadi Pelli movie has been released by actor Sandeep Kishan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ