Advertisementt

మహేష్ సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్

Wed 04th May 2022 09:17 AM
sekhar master,sekhar master interview,sarkaru vaari paata movie,mahesh babu  మహేష్ సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్
Sekhar Master Interview మహేష్ సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్
Advertisement
Ads by CJ

మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతంలో సర్కారు వారి పాట ఆడియో ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది. కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్.. ప్రేక్షకులని అమితంగా అలరించాయి. ముఖ్యంగా కళావతి పాట 150మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ ని సృష్టించింది. ఈ పాట లో మహేష్ బాబు వేసిన సిగ్నేచర్ స్టెప్స్ కు సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి రీల్స్ సందడి చేశాయి. మే 12న ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట గ్రాండ్‌ గా విడుదల కాబోతున్న నేపధ్యంలో సినిమా కోసం గ్రేట్ సిగ్నేచర్ మూమెంట్స్ ని కంపోజ్ చేసిన స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీడియాతో ముచ్చటించారు. 

 ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు ? బుల్లితెర, వెండితెరని అలరిస్తున్నారు. మీ సీక్రెట్ ఏమిటి ?

సీక్రెట్ ఏం లేదండీ. ఇచ్చిన పని చక్కగా చేయడమే. నా దృష్టి వెండితెరపైనే వుంది. ఐతే నెలకు రెండు రోజులు టీవీ షూటింగ్ కి సమయం కేటాయించా.

సర్కారు వారి పాటలో ఎన్ని పాటలు చేశారు ?

మూడు. కళావతి, పెన్నీ, ఇంకో మాస్ సాంగ్. కళావతి, పెన్నీ ఇప్పటికే విజయాలు సాధించాయి. రాబోతున్న పాట కూడా ఫ్యాన్స్ కు గొప్ప ట్రీట్. ఇందులో మహేష్ బాబు గారి స్వాగ్ అండ్ మాస్ రెండూ చూస్తారు. ఆయన సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి.

ఈ సినిమాలో మహేష్ బాబుగారి డ్యాన్సులు ఎలా వుంటాయి ?

వండర్ ఫుల్ గా వుంటాయి. ఫ్యాన్స్ కు బాగా నచ్చుతాయి. డ్యాన్స్ ఎంతబాగా చేశారో చూసిన తర్వాత మీరే చెప్తారు.

ఇప్పుడు పాటలన్నీ  ఇన్స్టంట్ హిట్స్ అవుతున్నాయి కదా ? ఇలాంటి పాటలు ఇవ్వడం ఎంత చాలెజింగా వుంటుంది?

ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక పాటలో అందరూ చేయగలిగే రెండు యునిక్ స్టెప్స్ వుంటే అది సోషల్ మీడియా రీల్స్ లోకి వెళ్లి హిట్స్ అవుతున్నాయి. అలాంటి యునిక్ స్టెప్స్ పై ద్రుష్టి పెట్టాల్సి వుంటుంది. కళావతి పెన్నీ సాంగ్స్ పై చాలా మంది రీల్స్ చేశారు. ఇప్పుడు రాబోతున్న మాస్ సాంగ్ కూడా అదిరిపోతుంది. అందులో కూడా యునీక్ స్టెప్స్ వుంటాయి.

ఒక పెద్ద హీరో సినిమా చేస్తున్నపుడు ఒత్తిడి వుంటుందా ?

ఒత్తిడి వుండదు. ఒక సాంగ్ కి మించిన సాంగ్ ఇవ్వాలనే పట్టుదల వుంటుంది, దాని కోసమే కష్టపడి పని చేస్తాం. సరిలేరు నికెవ్వరులో మైండ్ బ్లాక్ పాట సూపర్ హిట్. దానికంటే గొప్ప పాట ఇవ్వడానికి ప్రయత్నించాం.పాట అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది.

మహేష్ గారితో మీ కాంబినేషన్ ?

మహేష్ బాబు గారితో సరిలేరు నికెవ్వరులో డ్యాంగ్ డ్యాంగ్, మైండ్ బ్లాక్, సర్కారు వారి పాటలో మూడు సాంగ్స్.

మహేష్ గారు త్వరగా నేర్చుకుంటారా ?

అవును చాలా త్వరగా నేర్చుకుంటారు. మహేష్ బాబుగారిలో అద్భుతమైన రిధమ్ వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ అర్ధం చేసుకుంటే చాలు.

హీరో బాడీ లాంగ్వెజ్ ని బట్టి మూమెంట్స్ కంపోజ్ చేస్తారా ?

మొదట ట్యూన్ ఇంపార్ట్టెంట్. సాంగ్  ఎలాంటి మూమెంట్స్ కోరుకుంటుందో చూస్తాం. తర్వాత యాక్టర్ బాడీ లాంగ్వేజ్ చూస్తాం. మన స్టయిల్ కి హీరో బాడీ లాంగ్వెజ్ కి సరిపడా మూమెంట్స్ కంపోజ్ చేస్తాం.

కళావతి పాటని అందరూ రీల్స్ చేశారు. మహేష్, సితార ల్లో ఎవరు బాగా చేశారు ? ఒక కోరియోగ్రఫర్ గా చెప్పండి?

మహేష్-సితార ఇద్దరూ బాగా చేశారు. సితార పాపలో గొప్ప గ్రేస్ వుంది. ఐతే పెన్నీ ప్రమోషనల్ సాంగ్ కొరియోగ్రఫీలో నేను లేను. మా అసిస్టెంట్స్ చేశారు. సినిమాలో వచ్చే పాటలో సితార పాప కనిపించదు. 

కాపీ స్టెప్పులు అని విమర్శలు వస్తుంటాయి కదా ? దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ?

మనం ఒరిజినల్ గా చేస్తే మనది మనకే తెలిసిపోతుంది. మూమెంట్ కంపోజ్ చేస్తున్నపుడే కొత్తగా వుందా లేదా ? అనేది అర్ధమైపోతుంది.

మహేష్ గారితో పని చేయడం ఎలా అనిపిస్తుంది ? మహేష్ గారికి ఒక డ్యాన్స్ మాస్టర్ గా ఎన్ని మార్కులు వేస్తారు?

మహేష్ బాబు గారితో పనిచేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. మనం ఓకే అన్నా .. మాస్టర్ ఇంకోసారి చేద్దామా అంటారు. ఈ సినిమాలో ఆయన మరింత అందంగా కనిపిస్తారు. డ్యాన్స్ విషయానికి వస్తే సర్కారు వారి పాటలో సరికొత్త మహేష్ బాబు గారిని చూస్తారు. మహేష్ గారి డ్యాన్సులకి వంద మార్కులు వేస్తా.

మీరు పని చేసిన హీరోల్లో తక్కువ టైంలో మూమెంట్స్ నేర్చుకునే హీరో ఎవరు?

ఎన్టీఆర్ గారు ఒక్కసారి కూడా రిహర్సల్ కి రాలేదు.  ఆయన స్పాట్ లో చేసేస్తారు. మిగతా హీరోలు కూడా ఒక సారి చెప్పిన వెంటనే మూమెంట్ పట్టేస్తారు.   

మీ అంచనాలు తప్పిన పాట ?

జైలవకుశ లో ట్రింగ్ ట్రింగ్ సాంగ్. చాలా కొత్తగా చేశాం. చాలా ఆదరణ పొందుతుందని భావించాం. కానీ అది అనుకున్నంత కనెక్ట్ కాలేదు.

Sekhar Master Interview:

Sekhar Master Interview about Sarkaru Vaari Paata

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ