20 ఏళ్ళ క్రితం తెలుగులో 24 గంటల పాటు న్యూస్ అందిస్తూ.. వార్తా ప్రసారాలను మొదలు పెట్టి.. అప్పటినుండి చాలా ఏళ్లపాటు రేటింగ్స్, పబ్లిసిటీ, వార్తల కవరేజిలో నెంబర్ వన్ ఛానల్స్ గా, రారాజుగా.. వెలుగొందిన కొన్ని ఛానల్ ఇప్పుడు Ntv ముందు వెల వెల బోతుంది.. ఓదశలో తెలుగు ప్రజలకు వార్తా చానెల్ అంటే ఆ ఛానల్స్ మాత్రమే ఉండేది. ప్రజలకి ఆ ఛానల్స్ తప్పితే మరో ఛానల్స్ మార్చేందుకు అవకాశం కూడా ఉండేది కాదు. రామోజీ రావు గారు మొదలు పెట్టిన ఈటీవీలో రాత్రి 9గంటల న్యూస్ తప్పితే మొత్తం ఆ ఛానల్స్ దే హవా అన్నట్టు నడిచింది. గత కొన్నాళ్లుగా ప్రేక్షజులకి ఆ ఛానల్ పై మొహం కొట్టేసింది. దానితో అందరి చూపు Ntv పై పడింది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటూ ప్రజల కోసం నిక్కచ్చిగా వార్తలు ప్రసారం చేసిన Ntv వైపు ప్రజలు మొగ్గారు.
ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వార్తల కవరేజితో, లైవ్ న్యూస్ లతో దూసుకుపోయింది. బ్రేకింగ్ న్యూస్ కు ఎన్టీవీ పెట్టింది పేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన నెట్ వర్క్ ద్వారా వార్తలను ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకుంటూ సంచలనం రేపుతోంది. వార్తల కోసం ఇప్పుడు ఎన్టీవీ పెట్టండి ముందు అనే స్థాయికి వచ్చింది. అదే ఇప్పుడు ఎన్టీవీని తెలుగు వార్తా చానెల్స్ లో అగ్ర భాగాన నిలిచే విధంగా చేసింది. ఇందుకు నిదర్శనమే నెం.1 వార్తా చానెల్ గా ఎన్టీవీకి కట్టిన పట్టం.
దాదాపుగా14 వారాలుగా ఎన్టీవీ నెం.1గా కొనసాగుతూ 15వ వారం కూడా తన స్థానాన్ని కాపాడుకుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి చేరడం కాదు.. చేరాక నిలబెట్టుకోవడం కత్తి మీద సాము లాంటి వ్యవహారం. నిత్యం మారే నెంబర్ 1 పొజిషన్ మరో చానెల్ తన దరిదాపుల్లోకి రాకుండా వార్తలు, కథనాలతో తన సత్తా చాటుతోంది. ప్రతిక్షణం- ప్రజాహితం అనే తన స్లోగన్ కు తగ్గట్టే ఎన్టీవీ తన ప్రస్థానం కొనసాగిస్తూండటమే ఈ అప్రతిహత పొజిషన్ కు కారణమని చెప్పాలి. మొత్తంగా 82 రేటింగ్ పాయింట్లతో ఎన్టీవీ మొదటి స్థానంలో ఉండగా, టీవీ9 58, వీ6 30, టీవీ5 24, ఏబీఎన్ 18 రేటింగ్స్ తో వరుస స్థానాల్లో ఉన్నాయి.