సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం సర్కారు వారి పాట పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేసిన సర్కారు వారి పాట ఆల్బమ్ ఇప్పటికే మ్యాజిక్ ని క్రియేట్ చేసింది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కళావతి పాట మెలోడీ అఫ్ ది ఇయర్ గా నిలిచింది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే 100 మిల్లియన్ల వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించిన కళావతి పాట ఇప్పుడు టాలీవుడ్ ఫాస్టెస్ట్ 150 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి అరుదైన రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.9 మిలియన్స్ కు పైగా లైక్స్ సొంతం చేసుకుంది.
కళావతి పాట ఇంటర్నెట్ సెన్సేషన్ గా నిలవడమే కాకుండా వివిధ ఆడియో స్ట్రీమింగ్ వేదికలు, యాప్స్ లో టాప్ సాంగ్ లిస్టు లో కొనసాగుతుంది. యుట్యూబ్ లో కూడా ట్రెండింగ్ వీడియోస్ లో చాలా రోజుల పాటు అగ్రస్థానంలో కొనసాగింది. ఈ పాటలో మహేష్ బాబు క్లాసీ డ్యాన్సులు ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి. అనంత శ్రీరామ్ కళావతి పాటకు ఆకట్టుకునే సాహిత్యం అందించగా సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు.
కళావతి పాటతో పాటు పెన్నీ, సర్కారు వారి టైటిల్ సాంగ్స్ కూడా ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే సర్కారు వారి పాట నుంచి మాస్ సాంగ్ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.