Advertisementt

గేమ్ ఆన్ చిత్రం ప్రారంభం

Sat 23rd Apr 2022 08:14 PM
game on,game on movie,producer kumar babu g,geetanand,neha solanki,vasanthi,director ​​dayanand  గేమ్ ఆన్ చిత్రం ప్రారంభం
Game on movie Opening గేమ్ ఆన్ చిత్రం ప్రారంభం
Advertisement
Ads by CJ

లూజర్ గా ఉన్న ఒక యువకుడు విన్నర్ ఎలా అయ్యాడు అనే కథాంశంతో  అనెక్స్ పెక్టెడ్ ఎలిమెంట్స్ తో ట్విస్ట్ & టర్న్స్ తో సైకాలజికల్,రొమాంటిక్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఆన్. రవి కస్తూరి సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్, పమిడి క్రియేషన్స్ పతాకంపై గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో కుమార్ బాబు,రవి కస్తూరి, పమిడి రవితేజలు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న గేమ్ ఆన్ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానంలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు హీరో గీతానంద్,నేహా సోలంకి లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.ప్రముఖ పారిశ్రామిక వేత్త పమిడి రమేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

చిత్ర దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ.. ప్రవీణ్ సత్తారు గారు వచ్చి క్లాప్ కొట్టి మమ్మల్ని బ్లెస్స్ చేసినందుకు వారికి మా ధన్యవాదాలు.2020 నుండి ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ.. ప్రేక్షకులకు నెక్స్ట్ లెవల్ సినిమా ఇవ్వాలని ఈ స్క్రిప్ట్ ను రెడీ చేయడం జరిగింది. నేను చెప్పిన కథ నిర్మాతలకు ఎంతో నచ్చింది.రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ విత్ ఇండియన్ కోర్ ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. యూత్ నుండి పెద్దవాళ్లు వరకు అందరికీ నచ్చేటట్లు ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఎదో ఒక ఎమోషన్ సీన్ లో కచ్చితంగా కనెక్ట్ అవుతాడు.నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ మాకు చాలా చక్కగా కుదిరారు.. రెండు షెడ్యూల్స్ లో ఈ సినిమాను పూర్తి చేస్తాము. సైకాలజికల్ గేమ్ ఆన్ తో వస్తున్న ఈ చిత్రం యూత్ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

చిత్ర నిర్మాతలు జి. కుమార్ బాబు మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్, పమిడి క్రియేషన్స్ పతాకంపై గేమ్ ఆన్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాను.. ఈ చిత్రంలో యూత్ ను ఆకట్టుకునే అంశాలు చాలా వున్నాయి. ఈ స్క్రిప్ట్ కోసం దర్శకుడు చాలా కష్టపడ్డాడు. ఔట్ ఫుట్ కూడా బాగా వచ్చింది.ఈ సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కూడా యంగ్ ట్యాలెంటెడ్ పీపుల్స్ దొరికారు. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది  అన్నారు.

హీరో గీతానంద్ మాట్లాడుతూ.. ఈ గేమ్ ఆన్ చిత్రం సైకాలజికల్ యాక్షన్ డ్రామా.ఈ సినిమాలో చాలా డీప్ ఎమోషనల్ లేయర్స్ ఉంటాయి, అనెక్స్ పెక్టెడ్ గా ఇందులో చాలా జరగబోతున్నాయి. ట్విస్ట్ & టర్న్స్ ఇందులో చాలా ఉంటాయి. ఈ సినిమా స్క్రిప్ట్ కొరకు దర్శకుడు దయానంద్ చాలా కష్టపడ్డాడు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా 2022 లో బెస్ట్ సినిమా అవుతుంది అన్నారు.

Game on movie Opening:

Game on movie Opening

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ