Advertisementt

విక్కీ ది రాక్ స్టార్ టైటిల్ లోగో విడుదల

Fri 15th Apr 2022 03:05 PM
vicky the rockstar,vicky the rockstar movie,vicky the rockstar title logo,vikram,amrutha chowdary,pro sai satish,parvataneni rambabu,director cs ganta  విక్కీ ది రాక్ స్టార్ టైటిల్ లోగో విడుదల
Vicky The Rockstar Title Logo Released విక్కీ ది రాక్ స్టార్ టైటిల్ లోగో విడుదల
Advertisement
Ads by CJ

ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ట్రూ ఇన్సిడెంట్స్  ని ఆధారంగా చేసుకొని, గొప్ప ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న చిత్రం విక్కి ది రాక్ స్టార్ సిఎస్ గంటా దర్శకత్వంలో  శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి  ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ బాధ్యతలు చేపట్టారు. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్ బాణీలు కడుతున్నారు. సినిమాటోగ్రాఫర్‌ భాస్కర్  

విక్రమ్, అమృత చౌదరి, ప్రధాన పాత్రలలో రియ గుడివాడ, సాహితి, నానాజీ, రవితేజ, విశాల్, వంశీ రాజ్ నెక్కంటి, లావణ్య రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు చేస్తూనే ప్రమోషన్స్ చేపట్టి సినిమా పట్ల హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే రాక్ స్టార్ టైటిల్ లోగో, వీడియో రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవ్వరు చేయని  జానర్‌ని టచ్ చేస్తూ రెవల్యూషన్ థాట్స్‌తో మ్యూజిక్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది. 

కథ రిఫ్లెక్ట్ అయ్యేలా చాలా కొత్తగా ఈ రాక్ స్టార్ టైటిల్ లోగో ఉంది. ఎరుపు రంగులో టైటిల్ డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. ఈ మేరకు విడుదల చేసిన వీడియో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.  అతిత్వరలో ఫస్ట్ లుక్‌తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

సాంకేతిక వర్గం: డైరెక్టర్: సిఎస్ గంటా, బ్యానర్: స్టూడియో87 ప్రొడక్షన్స్, నిర్మాత: ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : సుభాష్, చరిత, సంగీతం: సునీల్ కశ్యప్, సినిమాటోగ్రాఫర్‌: భాస్కర్, ఎడిటర్: ప్రదీప్ జంబిగా, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్యామల చంద్ర, డిజైనర్: TSS కుమార్, పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Vicky The Rockstar Title Logo Released:

Different Concept Movie Vicky The Rockstar Title Logo Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ