బార్క్ రేటింగ్స్ విషయంలో ఎన్నో వివాదాలు, కేసుల తర్వాత తిరిగి బార్క్ రేటింగ్స్ విడుదల చేస్తున్న నేపథ్యంలో న్యూస్ ఛానెళ్ల రేటింగ్స్ పరిస్థితి ఆసక్తిగా మారుతుంది. గత కొంతకాలంగా తెలుగు మీడియాలో టీవీ9 బాగా వెనుకబడిందని రేటింగ్స్ ను బట్టి తెలుస్తుంది. పద్నాలుగు వారాలుగా టీవీ9ను వెనక్కి నెట్టి ఎన్టీవీ టాప్ లో నిలబడింది. గతంలో కూడా టీవీ9 ను దాటి ఎన్టీవీ, మిగిలిన ఛానెళ్లు అగ్రస్థానాన్ని అందుకున్నాయి కానీ వరుసగా 14 వారాల పాటు ఎన్టీవీ నే నెం.1 స్థానంలో నిలబడటం ప్రత్యేకం.
అంతేకాదు రేటింగ్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఎన్టీవీ కి దరిదాపుల్లో కూడా మరో ఛానెల్ లేదు. దీనికి కారణం ఆ ఛానెల్ ప్రసారం చేసే కార్యక్రమాలనే చెప్పాలి. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ లు, పొలిటికల్ ఎనాలిసిస్‌లు, సినీ, ఆరోగ్య కార్యక్రమాలతో ప్రజలకు ఎల్లప్పుడూ చేరువగా ఉండటం, స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంలో ఎన్టీవీ ప్రత్యేకతను గుర్తించే ప్రజలు ఎన్టీవీకి ఈ అరుదైన గౌరవాన్నిస్తున్నారు.
ఇక ప్రస్తుతం 14వారాలుగా విడుదలవుతున్న రేటింగ్స్ ప్రకారం సగటున 75.2 రేటింగ్ పాయింట్లతో ఎన్టీవీ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత టీవీ9 కి 46.8, వీ6 ఛానల్ కి 30 పాయింట్లు ఉన్నాయి. తదుపరి నాలుగైదు స్థానాల్లో టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెళ్లున్నాయి.