Advertisementt

లుంగీ కట్టి బసవన్నతో కిరణ్ మాస్ అవతార్

Sun 10th Apr 2022 12:26 PM
kiran abbavaram,vinaro bhagyamu vishnu katha first look,vinaro bhagyamu vishnu katha movie  లుంగీ కట్టి బసవన్నతో కిరణ్ మాస్ అవతార్
Vinaro Bhagyamu Vishnu Katha first look released లుంగీ కట్టి బసవన్నతో కిరణ్ మాస్ అవతార్
Advertisement
Ads by CJ

SR కల్యాణ మండపం , రాజావారు, రాణి వారు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం, క‌శ్మీర ప‌ర్ధేశీ జంట‌గా నటిస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ.  ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురూ ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కులు ప్ర‌శాంత్ నీల్, కిషోర్ తిరుమ‌ల ద‌గ్గ‌ర మురిళి కిషోర్ గ‌తంలో పని చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరుపతిలో జరుగుతుంది. 35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో 80 శాతం షూటింగ్ పూర్తి కానుంది. ఇందులోనే పాటలు, ఫైట్ సీక్వెన్స్ లు కూడా ఉండబోతున్నాయి. 

తాజాగా శ్రీరామనవమి సందర్భంగా వినరో భాగ్యము విష్ణుకథ నుంచి ఒక పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. గుడి ముందు డు డు బసవన్నతో లుంగీ కట్టుకొని పర్ఫెక్ట్ మాస్ లుక్ లో అందరిని అలరిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ లుక్ మాస్ ఆడియన్స్ తో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

Vinaro Bhagyamu Vishnu Katha first look released:

Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha first look released  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ