సత్య ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభం

Tue 15th Mar 2022 09:45 AM
satya film institute,satya master,sampornesh babu,jeevitha,rajashekar,vijayendra prasad  సత్య ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభం
Satya Film Institute launches సత్య ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభం

ప్రముఖ రైటర్, డైరెక్టర్  విజయేంద్ర ప్రసాద్ గారు, దర్శకుడు ప్రసన్నకుమార్, నటులు జీవితా రాజశేఖర్, సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్, హీరో సంపూర్ణేష్ బాబు, రాకేష్ మాస్టర్ ల చేతులమీ దుగా ఘనంగా ప్రారంభమైన సత్య ఫిల్మ్ ఇన్స్ట్యూట్.

సినిమాలో నటించాలంటే డైలాగ్స్, డ్యాన్స్ ఉంటే సరిపోదు వీటికి తోడు యాక్టింగ్, ఫైటింగ్ ఇలా ఎన్నో రకాల మెళుకువల్లో శిక్షణ పొందాలి. అలాంటి వారికోసం అన్నీ ఒకే చోట శిక్షణ ఇచ్చేలా సరికోత్త ఇన్స్ట్యూట్ మనముందుకు వచ్చింది.డ్యాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సత్య మాస్టర్ ఇంతకు ముందు సత్య ఫిలిం స్టూడియో, సత్య డి.జోన్స్ ఇన్స్టిట్యూట్ లు పెట్టి ఎంతో మందికి డ్యాన్స్ లో శిక్షణ ఇచ్చి వందల మంది డాన్సర్స్ ను తయారు చేసి టీవీ రంగానికి, సినిమా రంగానికి పరిచయం చేయడం జరిగింది. అయితే ఒక్క డ్యాన్స్ కే పరిమితం కాకుండా ట్యాలెంట్ ఉన్న యువతీ, యువకులకు నటనతో పాటు అన్నీ రకాల శిక్షణ ఇచ్చి పరిపూర్ణ నటులను తయారు చెయలనే ఉద్దేశ్యం తో సత్య ఫిల్మ్ అకాడమీ ప్రారంభోత్సవం సినీ, రాజకీయ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రైటర్ డైరెక్టర్  విజయేంద్ర ప్రసాద్ గారు,దర్శకుడు ప్రసన్నకుమార్,నటులు జీవితా రాజశేఖర్, కల్వకుంట్ల తేజస్వి, బీగల గణేష్ గుప్త,సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్,హీరో సంపూర్ణేష్ బాబు,రాకేష్ మాస్టర్, జితేంద్ర, రవి, భగవత్ ,రాధా మోహన్, జలదంకి సుధాకర్, కుద్దూస్, శ్యామల రెడ్డి, శివ, ఎం ఎల్ విజయ్, రవి, యాంకర్ గీతా బగత్ ఇలా అందరూ వచ్చి సత్య అకాడమీ ఫౌండర్ & CEO సత్య మాస్టర్ కు & టీం కు  బ్లెస్సింగ్స్ ఇస్తూ ఈ అకాడమీ ఎంతో మందికి శిక్షణ ఇచ్చి ఎంతో మంది నటులను పరిచయం చేస్తూ ఈ అకాడమీ ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ టీం అందరికీ అల్ ద బెస్ట్ తెలియజేశారు.

సత్య అకాడమీ ఫౌండర్ & CEO సత్య మాస్టర్ మాట్లాడుతూ.. మా సత్య ఆకాడమీ ని  బ్లెస్సింగ్స్ చేయడానికి వచ్చిన పెద్దలకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. భీమవరంలో పుట్టి అక్కడే విద్యాబ్యాసం చేస్తూ కాలేజ్ ఈవెంట్స్ లలో డ్యాన్స్ చేసే వాడిని. నాకు మా అన్న ఇన్స్పిరేషన్. తను చెన్నయ్ సినిమా రంగంలో డైరెక్టన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాడు. నేను విజయవాడలో మస్తాన్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్నాను. ఈ సత్య డీ జోన్ ద్వారా ఎన్నో వందల మంది డాన్సర్స్ ను తయారు చేసి టీవీ రంగానికి, సినిమా రంగానికి పంపించినందుకు చాలా గర్వపడుతున్నాను అన్నారు.

Satya Film Institute launches:

Satya Film Institute launches