Advertisement

ఘనంగా పద్మశ్రీ అర్ధ శతదినోత్సవ వేడుక

Mon 14th Mar 2022 05:44 PM
padma shri,padma shri movie,padma shri 50 days,ss patnaak,ss patnayak  ఘనంగా పద్మశ్రీ అర్ధ శతదినోత్సవ వేడుక
Padma Shri 50 Days Celebration ఘనంగా పద్మశ్రీ అర్ధ శతదినోత్సవ వేడుక
Advertisement

ప్రముఖ మెజీషియన్, హిప్నాటిస్ట్ బేతా శ్రీనివాసరాజు సమర్పణ లో ఎస్. ఎస్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. ఎస్ పట్నాయక్ రచన, దర్శకత్వంలో సదాశివుని శిరీష నిర్మాతగా మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ, PVS రామ్మోహన రావు సహా నిర్మాతలు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న కామెడీ బేస్డ్ యాక్షన్ ఓరియెంటెడ్ హారర్ మూవీ పద్మశ్రీ. జనవరి 22న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లలో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతూ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ 

అర్ధ శతడినోత్సవ వేడుకలు సినీ రాజకీయ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముక్య అతిధులుగా నిర్మాత రామ సత్యనారాయణ, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ , నిర్మాత లయన్ సాయి వెంకట్, ఆంధ్ర ప్రభ చీఫ్ ఎడిటర్ సీతారాం శర్మ, గుండమ్మ కథ నిర్మాత లక్ష్మీ, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కరణం మురళీధర్, బిజెపి లీడర్ పూడి తిరుపతిరావు, ప్రముఖ వేదపండితులు జీవీఎల్ నరసింహారావు, కులకర్ణి వెంకట శర్మ తదితరులు పాల్గొన్నారు. 

చిత్ర దర్శకుడు ఎస్. ఎస్ పట్నాయక్ మాట్లాడుతూ.. వరంగల్ లోని థియేటర్ లో పద్మశ్రీ సినిమా విడుదలై విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకొన్నందుకు చాలా సంతోషంగా ఉంది.మా సినిమాను వరంగల్ జడ్జి అనిల్ కిరణ్ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాసుదేవ్ రెడ్డి గార్లు సకుటుంబ సమేతంగా వచ్చి ఈ చిత్రాన్ని చూడడమే కాకుండా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ఉన్న సినిమాలను మనందరం ఎంకరేజ్ చేయాలని ప్రజలకు సందేశమిచ్చారు. ఇంకా ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో తీయాలని మమ్మల్ని ప్రాత్సహిస్తూ తనే పద్మశ్రీ 50 రోజుల కేక్ ను తెప్పించి నాతో కట్ చేయించడమే కాకుండా మా అందరికీ సన్మానం చేయడం జరిగింది.మేము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని అనుకుంటున్నాము. ఎందుకంటె  మేము కూడా 50 రోజుల పండుగ చేసుకోవాలి అనుకున్నాము. అయితే 50 రోజుల పండుగ చేసుకునే అర్హత ఉంది అనడానికి పద్మశ్రీ చిత్రంపై ఒక జడ్జి గారి జడ్జిమెంటే గీటురాయి. తను ఒక జడ్జి అయ్యివుండి కూడా వచ్చి మమ్మల్ని, మా సినిమాను తిలకించి బ్లెస్స్ చేసినందుకు వారికి  మా చిత్ర యూనిట్ తరుపున హృదయ పూర్వక పాదాభి వందనాలు తెలుపు కుంటున్నాము.ఈ సినిమా కోసం మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ మాకెంతో హెల్ప్ చేశారు. నటీనటులు, టెక్నీషియన్స్ సహకారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకు,మీడియా వారికి ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను అన్నారు. 

అతిథిగా వచ్చిన నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. మేము చాలా సినిమాలు తీశాము కానీ ఇంతవరకు మా సినిమాల పై 50 రోజుల పోస్టర్స్ చూడలేదు. కానీ SSపట్నాయక్ "పద్మశ్రీ" వంటి మంచి టైటిల్ తో అంతా కొత్త వారితో సినిమా తీసి 50 డేస్ ఫంక్షన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

నిర్మాత లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ.. నేను ఇప్పటి వరకు 500 సినిమా ఫంక్షన్స్ కు వెళ్ళాను. కానీ ఇప్పటివరకు 50 డేస్ ఫంక్షన్ చేసుకోవడం చూడలేదు. అటువంటిది పద్మశ్రీ ని విడుదల చేసి 50 డేస్ ఫంక్షన్ చేరుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఒక జర్నలిడ్త్ గా రైటర్ గా దర్శకుడు గా, నలుగురిలో ఒక హీరోగా ఇలా అన్నింటిలో తానే అయ్యి ఎంత కష్టమైనా ఇష్టంతో పద్మశ్రీ వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా తీసి ఆ సినిమాను 50 డేస్ ఫంక్షన్ జరుపుకోవడం గొప్ప విషయం.. ఈ ఫంక్షన్ కు తనకు చదువు నేర్పిన గురువులతో, దర్శకత్వంలో మెలుకులవు నేర్పిన గురువులతో, శ్రేయోభిలాషుల సమక్షంలో అతిథులుగా వచ్చిన తమకు సన్మానం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

ఆంధ్ర ప్రభ చీఫ్ ఎడిటర్ సీతారాం శర్మ, మాట్లాడుతూ.. పట్నాయక్ అల్ రౌండర్ .పద్మశ్రీ అనే పేరులోనే సక్సెస్  ఉంది.అయితే మంచి కంటెంట్ తో తీసిన పట్నాయక్ ఇంకా ఇలాంటి విజయోత్సవ మైనటువంటి మంచి సినిమాలు తీసి తన సినిమాలకు పద్మశ్రీ అవార్డు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

షేడ్ మ్యూజిక్ చానల్ అధినేత దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. ఒకప్పుడు సినిమా తీస్తే ఫ్యామిలీ కి దూరమవుతారు అన్నారు.కానీ నేడు ఫ్యామిలీస్ అందరూ సినిమాలు తీయడానికి సపోర్ట్ చేస్తున్నారు.ఇండస్ట్రీకు రాజమౌళి పెద్ద డైరెక్టర్ అయితే మాకు SS పట్నాయక్ చిన్న రాజమౌళి అనుకుంటున్నాము.ఈ సినిమా ఇంత గొప్ప విజయం సాదించినందుకు సంతోషంగా ఉంది అన్నారు.

చిత్ర ఎడిటర్ కంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరోనా టైం లో రిలీజ్ చేసుకొని 50 డేస్ అయినా ఇంకా దిగ్విజయంగా థియేటర్స్ లలో ప్రదర్శింప బడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

ప్రముఖ బిజెపి లీడర్, విద్యావేత్త, నటులు పూరి తిరుపతి మాట్లాడుతూ.. దర్శకుడు పట్నాయక్ తో నాకు చాలా రోజులుగా అనుబందం ఉంది.తను నాకు కొడుకుతో సమానం.ఈ  సినిమా నిర్మించిన తరువాత కోవిడ్ కారణంగా  చాలా ఇబ్బంది పడ్డారు.అయినా ఎంతో ధైర్యంగా విడుదల చేశారు. ఈ పద్మశ్రీ సినిమాతో ఇప్పటివరకు కీర్తి గడించారు.ఇక ముందు కనకం గడించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

లిరిక్ రైటర్ సురేష్ మాట్లాడుతూ.. దర్శకుడు పట్నాయక్ ఈ సినిమాను కొత్త వారితో తీసి విజయం సాధించాడు. ప్రస్తుతం ఈ రోజుల్లో 50 డేస్ ఫంక్షన్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

నటీనటులు: కిషోర్ కుమార్, రావిపల్లి సంధ్యారాణి, మరుపల్లి సతీష్, కాళీ చరణ్, డా. ప్రవీణ్, బొమ్మలాట సారిక, జయశ్రీ, పూజారి లక్ష్మణ రావు, చదలవాడ హరిబాబు, కరుణాకర్ తదితరులు హాజరై చిత్రం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకోసం డైరెక్టర్ ఎస్ఎస్ పట్నాయక్ గారికీ ఎన్ని అడ్డంకులను,ఒడిదుడుకులు వచ్చినా సినిమాకు చాలా చక్కగా తీశారు.ఈ సినిమాలో తెలిసిన ఆర్టిస్టులు లేకపోయినా కొత్తవారైనా సరే మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా ప్రూవ్ చేసింది ఆన్నారు. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన  నిర్మాతలు సదాశివుని శిరీష, మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణకు ధన్యవాదాలు తెలియపరచుకున్నారు. 

బ్యానర్: ఎస్. ఎస్ పిక్చర్స్, రచన, దర్శకత్వం: ఎస్. ఎస్ పట్నాయక్, నిర్మాత: సదాశివుని శిరీష, సహ నిర్మాతలు: మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ, PVS రామ్మోహన రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: pvg కృష్ణంరాజు, M. నర్సింగరావు, ఛాయాగ్రహణం: మేకల నర్సింగరావు, ఎడిటింగ్ : కంబాల శ్రీనివాస రావు, ఆర్ట్: మణిపాత్రుని నాగేశ్వర రావు, ఫైట్స్: దేవరాజు మాస్టర్, సంగీతం: జాన్ పోట్ల, కొరియోగ్రాఫర్స్: వెంకట్, తారక్, పి ఆర్.ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Padma Shri 50 Days Celebration:

Padma Shri Half Centenary Celebration

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement