Advertisementt

రాధే శ్యామ్ మూవీ ప్రెస్ నోట్

Mon 14th Mar 2022 02:50 PM
radhe shyam,radhe shyam movie,radhe shyam movie collections,prabhas  రాధే శ్యామ్ మూవీ ప్రెస్ నోట్
Radhe Shyam Movie press note రాధే శ్యామ్ మూవీ ప్రెస్ నోట్
Advertisement
Ads by CJ

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ కుమారి తెరకెక్కించిన ఇండియా లవ్ స్టోరీ రాధే శ్యామ్ అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇండియాలో మొదటి సారి ఒక ప్రేమకథకు ఈ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురుస్తుంది. మూడు రోజుల్లోనే 151 కోట్ల గ్రాస్ వసూలు చేసింది రాధే శ్యామ్. పాజిటివ్ మౌత్ టాక్ తో థియేటర్లకు ప్రేక్షకులు కదులుతున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఈ సినిమాకు అనూహ్యమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రభాస్జ్ పూజా హెగ్డే కెమిస్ట్రీకి అందరూ ఫీలవుతున్నారు. అలాగే రాధా కృష్ణ కుమార్ టేకింగ్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. ఇప్పటికే నిర్మాతలకు బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈ సినిమా. 

సినిమాకు పెట్టిన ఖర్చుకు.. చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ కు.. ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ కు.. నిర్మాతలు ఇప్పటికే సేఫ్ అయిపోయారు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రాధే శ్యామ్ రికార్డ్ క్రియేట్ చేసింది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఆల్ టైం రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ఇక ఇప్పుడు థియేటర్లలో కూడా సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు రోజుల్లో అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. ఒక ప్రేమ కథకు ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుండడం ఇదే మొదటిసారి. ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ రాధే శ్యామ్ సినిమా మరోసారి నిరూపించింది. అత్యద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్.. ఎమోషనల్ గా సాగే లవ్ స్టోరీ.. కట్టి పడేసే క్లైమాక్స్ సన్నివేశాలు రాధే శ్యామ్ సినిమాకు పాజిటివ్ గా నిలిచాయి. ఇదే సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నాయి.

Radhe Shyam Movie press note :

Radhe Shyam movie update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ