గత ఏడాది వరుడు కావలెను, లక్ష్య సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన హీరో నాగ శౌర్య.. ప్రస్తుతం తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ బేనర్లో అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో కృష్ణ వ్రింద విహారి చిత్రంలో నటిస్తున్నాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 22న కృష్ణ వ్రింద విహారి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ ని ప్రకటించిన పోస్టర్లో నాగ శౌర్య, హీరోయిన్ షిర్లీ సెటియా ట్రెడిషన్ వేర్ లో స్కూటర్ పై వెళుతూ చూడముచ్చటగా ఉన్నారు.
నాగ శౌర్య - షిర్లీ మధ్యన మంచి రొమాంటిక్ యాంగిల్ ఉన్నట్లుగా ఈ పోస్టర్ చూస్తే అనిపిస్తుంది. ఫస్ట్ టైం నాగ శౌర్య ఈ చిత్రంలో ఇంట ట్రెడిషనల్ పాత్రను పోషిస్తున్నాడు. ఇంతకుముందు సినిమాలలో అతని పాత్రలకు భిన్నంగా, వినోదభరితమైన పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నట్లుగా తెలుస్తుంది.