అల్లం వారి పెళ్లి పిలుపు వాయిదా
AVAK postponed indefinitelyపాగల్ తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా రాబోతున్న చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. షూటింగ్ కంప్లీట్ చేసుకుని రీలాస్ డేట్ కూడా అనౌన్స్ చేసారు మేకర్స్. మార్చ్ 4 న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
అశోకవనంలో అర్జున కళ్యాణం ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా నిర్వహిస్తున్న మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ విషయంలోనూ అనౌన్స్‌మెంట్‌ను డిఫరెంట్‌గా ఇచ్చారు. సినిమాలో విశ్వక్ సేన్ అల్లం అర్జున్ కుమార్ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర పేరు మీదనే ప్రకటనను వెలువరిచారు. అల్లం అర్జున్ కుమార్ జాతక రీత్యా మార్చి 4వ తేదిన పెళ్లి ముహూర్తం సరికాదని జ్యోతిష్క్యులు నిర్దారించారు. కావున కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం.. ఇట్లు అల్లం వారి పెళ్లి పిలుపు అంటూ రిలీజ్ డేట్ ప్రకటనను చేయటం డిఫరెంట్‌గా ఉంది.
Ashoka Vanamlo Arjuna Kalyanam postponed







































