ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, కొండ పొలంతో ప్రయోగాత్మక చిత్రం లో నటించిన వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశాయ దర్శకత్వంలో రంగ రంగ వైభవంగా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం రంగ రంగ వైభవంగా షూటింగ్ ఓ పాట మినహా పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు మేకర్స్. సినిమా ఔట్‌పుట్‌పై మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ డైరెక్షన్‌లో లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ కలగలిసిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న రంగ రంగ వైభవంగా లో వైష్ణవ తేజ్ పొలిటిషన్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇక షూటింగ్ పూర్తవడంతో రంగ రంగ వైభవంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రీసెంట్‌గా విడుదలైన టైటిల్ టీజర్, పాటకు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది.