Advertisementt

శివరాత్రి స్పెషల్ గా రామారావు ఆన్ డ్యూటీ

Sat 26th Feb 2022 04:42 PM
mass maharaja,ravi teja,sarath mandava,sudhakar cherukuri,ramarao on duty movie,ramarao on duty teaser on march 1st  శివరాత్రి స్పెషల్ గా రామారావు ఆన్ డ్యూటీ
Ramarao On Duty Teaser On శివరాత్రి స్పెషల్ గా రామారావు ఆన్ డ్యూటీ
Advertisement
Ads by CJ

మాస్ మహారాజా రవితేజ వరస లైనప్ తో సినిమాలు ముగించేస్తున్నారు. ఈ నెలలో ఖిలాడీ రిలీజ్ చేసారో లేదో.. మరో యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ షూటింగ్ ముగింపు దశకు తెచ్చేసారు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి కాగా రెండు పాటల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ని కూడా రిలీజ్ కి రెడీ చేస్తున్నారు మేకర్స్. ప్రమోషన్స్ లో భాగంగా రామారావు ఆన్ డ్యూటీ`సినిమా టీజర్ లాంచ్ తేదీని మేకర్స్ ఖరారు చేశారు. రామారావు ఆన్ డ్యూటీ టీజర్ మార్చి 1వ తేదీన మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రవితేజ న్యూ యాక్షన్ పోస్టర్ విడుదలచేసింది. ఈ పోస్టర్లో రవితేజ ఆకట్టుకునేలా సరికొత్త గెటప్లో కనిపించారు. ఈ పోస్టర్ భారీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా వైరల్ అయ్యింది. 

చిరు నవ్వుతో, చిరుజల్లు సినిమాల హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

Ramarao On Duty Teaser On:

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri Ramarao On Duty Teaser On March 1st

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ