Advertisementt

నవీన్‌చంద్ర, కార్తీక్‌రత్నం కొత్త సినిమా

Fri 18th Feb 2022 04:22 PM
production no 6,production no 6 movie opening,naveen chandra,akrthik ratnam. kl vijay  నవీన్‌చంద్ర, కార్తీక్‌రత్నం కొత్త సినిమా
Naveen Chandra - Karthik Ratnam Movie Opening నవీన్‌చంద్ర, కార్తీక్‌రత్నం కొత్త సినిమా
Advertisement
Ads by CJ
ప్రకాశ్‌రాజు, నవీన్‌చంద్ర,  కార్తీక్‌రత్నంలు  కీలకపాత్రల్లో నటిస్తోన్న తెలుగు, తమిళ ద్విభాషా  చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది.  శ్రీ అండ్‌ కావ్య సమర్పణలో ప్రొడక్షన్‌ నం 6గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని థింక్‌ బిగ్‌ బ్యానర్‌పై తలైవి దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్, శ్రీ షిరిడిసాయి మూవీస్‌ అధినేత యం. రాజశేఖర్‌ రెడ్డి, ప్రకాశ్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రకాశ్‌రాజ్, శ్రీక్రియేషన్స్‌పై బి.నర్సింగరావులు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో వాలీ మోహన్‌దాస్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నటుడు తనికెళ్ల భరణి పూజచేసి నిర్మాతలను ఆశీర్వదించటంతో  సినిమా ప్రారంభం అయ్యింది. అనంతరం దర్శకుడు వేగేశ్న సతీష్, రచయిత జనార్ధన మహర్షి, సంగీత దర్శకులు ఆర్‌.పి పట్నాయక్‌ చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను దర్శకుడు వాలీ, నిర్మాతలు విజయ్, రాజశేఖర్‌కి అందించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నవీన్‌చంద్ర, కార్తీక్‌ రత్నంలపై ప్రముఖ నటుడు అలీ క్లాప్‌ కొట్టగా, నిర్మాత సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ్‌ కెమెరా స్విచాన్‌ చేశారు.  తొలి షాట్‌కు ఆర్‌ ఎక్స్‌ 100 ఫేమ్‌ అజయ్‌ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు. 

పాత్రికేయుల సమావేశంలో నిర్మాత యం. రాజశేఖర్‌ మాట్లాడుతూ– నేను చెప్పిన ఈ సినిమా కథను నమ్మి నాతో ట్రావెల్‌ చేయటానికి ముందుకొచ్చిన  ముగ్గురుకి నేను థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. కథ వినగానే ప్రకాశ్‌రాజు గారు, ఏ.ఎల్‌ విజయ్‌ గారు, నవీన్‌చంద్ర మనం సినిమా కలిసి చేస్తున్నాం అని నన్ను నమ్మి ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు అన్నారు. 

నవీన్‌చంద్ర మాట్లాడుతూ– ఈ సినిమా కథ చాలా స్పెషల్‌. ఎంతోమంది ఈ కథతో నిజ జీవితంలో ఇన్‌స్ఫైర్‌ అవుతారు. ఇలాంటి మంచి కథతో నా దగ్గరికి వచ్చిన దర్శకుడు వాలీకి థ్యాంక్స్‌. చక్కని కథలను తెరకెక్కించే నిర్మాత రాజశేఖర్‌ అన్న నాకు ఎప్పటినుండో మంచి మిత్రుడు. ఎంతోమంది సినిమా పెద్దలు వచ్చి మా సినిమాను బ్లెస్‌ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్‌ అన్నారు. 

కార్తీక్‌ రత్నం మాట్లాడుతూ– దర్శకుడు వాలీ కథను ఎంతో కొత్తగా రాసుకున్నారు. నిర్మాత రాజశేఖర్‌ గారు తెలుగులో నేను నటించిన కేరాఫ్‌ కెంచెరపాలెం సినిమాను తమిళ్‌లో కేరాఫ్‌ కాదల్‌ తెరకెక్కించి నన్ను తమిళ్‌కి కూడా పరిచయం చేశారు. ఈ సినిమాతో ఆయన పెద్ద విజయం సాదిస్తారుఅన్నారు. విజయ్‌ మాట్లాడుతూ  కంటెంట్‌ ఉన్న ఏ సినిమా అయినా  నాకు చాలా ఇష్టం. అలాంటి కథతో రాజశేఖర్‌ నా దగ్గరికి వచ్చారు. కథ నచ్చటంతో పెద్ద సినిమా అవుతుంది అనే నమ్మకంతో ఈ సినిమాలోకి ఎంటర్‌ అయ్యాను అన్నారు. 

ఈ కార్యక్రమంలో నిర్మాత బి.నర్సింగరావు, నటుడు రాజారవీంధ్ర,  దర్శకుడు శ్రీపురం కిరణ్,  గుణ 369 ఫేమ్‌ డైరెక్టర్‌ అర్జున్‌ జంధ్యాల, దర్శకులు గౌతమ్‌ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. వాణీబోజన్, అమృతా అయ్యర్‌లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి  కెమెరా–గురుదేవ్, ఎడిటర్‌– సతీష్‌ , ఆర్ట్‌– హరిబాబు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌– రంగా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – శివమల్లాల

Naveen Chandra - Karthik Ratnam Movie Opening:

Production No 6 Movie Opening

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ