బాలీవుడ్ లో ఖాన్ త్రయానికి చెక్ చెప్పగలిగే హీరో హృతిక్ ఒక్కడే అని భావించిన బ్యాచ్ కూడా బాహుబలి చూసాక మన ప్రభాస్ కి సాహో అనేసారు. సౌతు - నార్తు అనే పదాలు పక్కకి జరిగాయి. ఓవర్సీస్ రెవిన్యూ - ఓవరాల్ రెవిన్యూ అనే మాటలు చాటుకు చేరాయి. రాష్ట్రమేదైనా అదే రిసెప్షన్. దేశమేదైనా అదే రియాక్షన్. ఇదీ ప్రభాస్ పై ప్రపంచ సినీ ప్రేక్షకులు చూపిస్తోన్న మోజు. ఇదే ప్రాంతాలకు అతీతంగా ప్రభాస్ కి వచ్చిన క్రేజు.
మరీ స్థితిలో ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా కోసం తన రిలీజ్ డేట్ ఆగష్టు 11 ని ఆదిపురుష్ ప్రభాస్ ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందీ అంటే.. అదే మామూలు వాళ్లకు అర్ధం కాని బాలీవుడ్ మంత్రాంగం. సినీజోష్ కి అందిన ఇన్ఫో మేరకు ఇంటర్నల్ గా జరిగిన కొన్ని ఒప్పందాలు తప్పుకోక తప్పని పరిస్థితి తెచ్చాయట. ఈ డేట్స్ సర్దుబాటు వ్యవహారంలో కొన్ని పెద్ద తలకాయలే చక్రం తిప్పాయట.
సరే ఏదైతేనేం.. ఆగష్టు 11 అనే డేట్ ఆమిర్ ఖాన్ అధికారికంగా ఆక్యుపై చేసేసినట్టే కనుక ఆది పురుష్ సంగతేంటి.. అది రాగలిగే అనువైన డేట్ ఏంటి.. అంటే దానికీ ఓ సమాధానం ఉంది. ఆ సమాధానంలోనే ఓ సమస్యా ఉంది. అదేంటో కూడా చూసేద్దాం.
ప్రభాస్ ఎలాట్ చేసిన డేట్స్ ని పర్ఫెక్ట్ గా యుటిలైజ్ చేసుకుంటూ యుద్ధ ప్రాతిపదికన ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసిన దర్శకుడు ఓం రావత్ ప్రస్తుతం ఆ సినిమా సీజీ వర్క్ లో బిజీ బిజీగా ఉన్నారు. డేట్ పోస్టుపోన్ అయిందనే మేటర్ మైండ్ లో పెట్టుకోకుండా ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం జూలై 15 కే ఆదిపురుష్ అవుట్ ఫుట్ రెడీ అయిపోతుందట. ఆగష్టు 11 వదిలేసుకున్నప్పటికీ అక్టోబర్ 5 రూపంలో మరో సరైన తేదీ ఆది పురుష్ యూనిట్ ని ఊరిస్తోంది. సరిగ్గా విజయ దశమి రోజైన అక్టోబర్ 5 ఆదిపురుష్ రాకకు అన్నివిధాలా మంచిదే. కానీ ఆ రోజు బుధవారం. పండగ అడ్వాంటేజ్, లాంగ్ వీకెండ్ అనేవి తెలుగు రాష్ట్రాల వరకు ఓకే కానీ ఆల్ అదర్ ఏరియాస్ కీ అలవాటైపోయి ఉన్న ఫ్రైడే రిలీజ్ ఫ్యాక్టర్ ఆదిపురుష్ కి అడ్డంకిగా మారింది. ఇప్పుడీ టాపిక్ పైనే డీప్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయని... వన్ వీక్ లో ఆదిపురుష్ డేట్ లాక్ చేసేస్తారని తెలుస్తోంది.
అయినా బాహుబలిగా వచ్చి ఇండియన్ బాక్సాఫీసుకి న్యూ నంబర్స్ ఇంట్రడ్యూస్ చేసిన ప్రభాస్ రెగ్యులర్ ఫ్రైడే రిలీజ్ ఫార్మేట్ బ్రేక్ చేసి రెండ్రోజుల ముందునుంచే రెవిన్యూ ఎలా లాగాలో చూపిస్తాడో ఏమో.. ఆ కోణంలోనూ తనని ఆదిపురుష్ అనుకోవచ్చేమో..!