భారతదేశంలోనే మొట్టమొదటి NFT మూవీ మార్కెట్ ప్లేస్‌గా Oracle Movies మొదలైంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ నిర్మాతలు మరింతగా ఆదాయాన్ని ఆర్జించడంలో సహాయం చేయడమే దీని లక్ష్యం. టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్ సెంథిల్ నాయగమ్, చిత్ర నిర్మాత మరియు మూవీ బిజినెస్ కన్సల్టెంట్ జి.కె. తిరునావుక్కరసు కలిసి Oracle Movies స్థాపించడానికి చేతులు కలిపారు.
నాన్-ఫంగిబుల్ టోకెన్.. సంక్షిప్తంగా NFT. అధునాతనమైన, సురక్షితమైన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా మూవీ రైట్స్ కొనడానికి, అమ్మడానికి ఇది చిత్ర నిర్మాతలకు, కంపెనీలకు తోడ్పడుతుంది. ముందు Oracle Movies సంస్థ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల నిర్మాతలకు, IP రైట్స్ ఉన్నవారికి తన సేవలను అందించనుంది.
ఈ సందర్భంగా Oracle Movies COO విజయ్ డింగరి మాట్లాడుతూ ప్రస్తుతం కంటెంట్ అనేది కింగ్. ఓటీటీలు సరైన కంటెంట్ కోసం వెతుకుతున్నాయి. అలాగే నిర్మాతలు వారి దగ్గర ఉన్న కంటెంట్‌ను అమ్మేందుకు సరైన వేదిక కోసం చూస్తున్నారు. ఓటీటీలకు, నిర్మాతలకు మధ్య ఉన్న అంతరాన్ని NFT తీర్చుతుంది. ధరతో పాటు ఏ ప్లాట్‌ఫామ్ కరక్టో కూడా సూచించడంలో NFT సహాయం చేస్తుంది అన్నారు.