Advertisementt

భీమ్లా నాయక్ డిజాస్టర్ అవ్వుద్ది అంటున్నారు

Tue 15th Feb 2022 12:29 AM
pawan kalyan bheemla nayak movie releasing on april 1st,bheemla nayak finally coming on fibravary 25th,negative comments on bheemla nayak movie  భీమ్లా నాయక్ డిజాస్టర్ అవ్వుద్ది అంటున్నారు
Negative Comments On Bheemla Nayak భీమ్లా నాయక్ డిజాస్టర్ అవ్వుద్ది అంటున్నారు
Advertisement
Ads by CJ

భీమ్లా నాయక్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ చూడాలని ఇక్కడి అభిమానులు ఎంత ఉత్సాహంతో ఊగిపోతున్నారో.. మలయాళీ ప్రేక్షకులు అంతే విమర్శలతో విరుచుకు పడుతున్నారు. అయ్యప్పనుం కోషియం పేరుతో విడుదలై విజయం సాధించిన మలయాళీ చిత్రానికి తెలుగు రీమేక్ వెర్షనే భీమ్లా నాయక్ అన్న సంగతి తెలిసిందే. అయితే అయ్యప్పన్ నాయర్ - కోషి కురియన్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ.. ఆపై ఏర్పడే సంఘర్షణ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ఆ అద్భుత చిత్రాన్ని భీమ్లా నాయక్ పేరుతో హీరో సెంట్రిక్ ఫిలింగా మార్చెయ్యడం మొదట విమర్శలకు తెర లేపింది. 

అక్కడ్నుంచి ఆ సినిమాని పవన్ ఫిలింగానే ప్రమోట్ చేస్తూ రావడం, 2 గంటల 55 నిముషాల ఒరిజినల్ కథని ఏకంగా 2  గంటల 10 నిమిషాలకి కుదించెయ్యడం, దానికోసం పవన్-నిత్యామీనన్ ల మధ్య ఉండాల్సిన అంత ఇష్టం పాటనే ఎత్తెయ్యడం, ఉద్వేగభరితంగా సాగాల్సిన కథని ఊర మాస్ సినిమాగా మార్చెయ్యడం వంటివి విపరీతమైన విమర్శలకు తావిస్తున్నాయి. సోషల్ మీడియాలోని ప్రతి ఫ్లాట్ ఫామ్ లోను భీమ్లా నాయక్ అప్ డేట్స్ కి పవన్ ఫాన్స్ ఏ రేంజ్ లో రెస్పాండ్ అవుతున్నారో... అదే రేంజ్ లో రియాక్ట్ అవుతూ నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు అయ్యప్పనుం కోషియం సినిమా ఫ్యాన్స్. 

బట్ అక్కడ అయ్యప్పనుం కోషియం అంత పెద్ద హిట్ అయినా ఫైనల్ గా వచ్చింది యాభై కోట్లే. ఇక్కడ ఈ సినిమా చేసినందుకే పవన్ కి యాభై కోట్లు చెల్లించారని టాక్. పవన్ చేయడం వల్ల అక్కడి 50 కోట్ల మూవీ ఇక్కడ దాదాపు 200 కోట్ల మూవీగా మారిపోయింది. మరీ పవర్ స్టార్ క్రేజు, ఇమేజు చూసి కుళ్ళుకుంటున్నారో.. యాంటీ ఫ్యాన్స్ అందరూ మలయాళీ మాస్కులు తొడుక్కుంటున్నారో కానీ భీమ్లా నాయక్ డిజాస్టర్ అవ్వుద్దంటూ నెగెటివ్ కామెంట్స్ వైరల్ చేస్తున్నారు. గతంలో ఓసారిలాగే రీ మేకు గట్టిగా దింపారుగా అంటూ పవన్ తో త్రివిక్రమ్ ఆడించిన తీన్ మార్ ని గుర్తుకు తెస్తున్నారు.!

Negative Comments On Bheemla Nayak:

Ayyappanum Koshiyam Movie Fans Fires On Pawan Kalyan Bheemla Nayak 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ