Advertisementt

ప్రపంచం బాధే నా బాధ: సన్ అఫ్ ఇండియా

Thu 10th Feb 2022 04:31 PM
son of india,mohan babu,son of india movie trailer,dimond ratnam babu  ప్రపంచం బాధే నా బాధ: సన్ అఫ్ ఇండియా
Son of India Movie trailer ప్రపంచం బాధే నా బాధ: సన్ అఫ్ ఇండియా
Advertisement
Ads by CJ

మంచు మోహన్‌బాబు హీరోగా డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సన్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల 18 న రిలీజ్ కి రెడీ అవుతుంది.ఈ సినిమాకి హీరోగానే కాకుండా మోహన్‌బాబు స్క్రీన్‌ప్లే బాధ్యతను కూడా నిర్వహించారు. ప్రమోషన్స్ లో భాగంగా సన్ అఫ్ ఇండియా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసారు. సన్ అఫ్ ఇండియా ట్రైలర్ లోకి వెళితే..

ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది... 

ప్రపంచమంతా నా కుటుంబం... ప్రపంచం బాధే నా బాధ...

స్వామి... ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... నేను దాన్నే ఫాలో అవుతున్నా...

ఇండియాలో అసలు న్యాయమే జరగదా...

డబ్బున్నోడికి ఓ న్యాయం ... డబ్బులేనోడికి ఓ న్యాయం... పవర్ ఉన్నోడికి ఓ న్యాయం... పవర్ లేనోడికి ఓ న్యాయం... డెమోక్రసీలో లా ఒకొక్కడికి ఒక్కోలా ఉంటే ఎలా...

అయ్యోధ్యలో శ్రీరామ అని రాసిన ప్రతి ఇటుక మీద ప్రమాణం చేసి చెబుతున్నాను... ఈ సొసైటీలో చెత్త నా కొడుకులని, క్రిమనల్ నా కొడుకులని ఏరిపారేయాలి...

పోరాటంలో అతని వెనుక ఇండియానే ఉంది... 

నీ ప్రశ్నలన్నింటికి సమాధానం నీతో పాటు 135 కోట్ల ఇండియన్స్ కి చాలా డిటైయిల్డ్ గా చెబుతాను... 

1 మినిట్ 33 సెకన్ల ట్రైలర్ పవర్ ఫుల్ డైలాగ్స్, అలాగే విజువల్స్ తో ఆకట్టుకునే విధంగా ఉంది. 

Son of India Movie trailer :

Son of India Movie trailer review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ