ఈ నెల 11న సీవీ రెడ్డి దర్శకత్వంలో 'ఆఖరి ముద్దు' చిత్రం షూటింగ్ ప్రారంభం
రాజీవ్ సాలూరి, దీప ప్రధాన పాత్రలో ఈ నెల 11న 'ఆఖరి ముద్దు' అనే చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు సి వి రెడ్డి ఆలోచింపజేసే కథాంశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీవీ ఆర్ట్స్ పై ఈ సినిమాని సి, వి. రెడ్డి ఎనిమిది సంవత్సరాల తరువాత నిర్మిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఈ సినిమా కథను తయారు చేసుకున్న సీవీ రెడ్డి దీనికి 'ఆఖరి ముద్దు' అన్న పేరు నిర్ణయించారు.
ఈ కథ తనని బాగా ప్రభావితం చేసిందని, ముఖ్యంగా సమాజానికి మార్గదర్శకం కావాలనే ఉద్దేశ్యం తోనే ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గతంలో సీవీ రెడ్డి తెలుగులో పది చిత్రాలు, కన్నడ, తమిళం లో అనేక చిత్రాలు నిర్మించారు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.. 'బదిలి' అనే చిత్రం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు స్వీకరించారు. 'పెళ్లి గోల, విజయరామరాజు, శ్వేత నాగు, ఆడుతూ పడుతూ' లాంటి సూపర్ హిట్ చిత్రాలను సివి. రెడ్డి నిర్మించారు. నేషనల్ ఫిలిం అవార్డ్స్, ఇండియన్ పనోరమా కమిటీ మెంబర్ గా, ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ కమిటీ కి చైర్మన్ గా గౌరవ ప్రదమైన సేవలందించారు. 'ఆఖరి ముద్దు' సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలతో పాటు తానే నిర్మిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు.
తారాగణం: హీరో రాజీవ్ సాలూరి, హీరోయిన్ దీప, సీత కాకరాల, పవిత్ర లోకేష్, పోసాని తదితరులు.
సాంకేతిక వర్గం: బ్యానర్: సీవీ ఆర్ట్స్, ప్రొడ్యూసర్, స్టోరీ -స్క్రీన్ ప్లే -డైరెక్షన్: సీవీ రెడ్డి, కో -డైరెక్టర్: వి. శ్రీనివాస్, డి ఓ పి: ఆండ్ర బాబు, మ్యూజిక్: కోటి, ఆర్ట్ డైరెక్టర్: మౌళి, ఎడిటర్: ప్రవీణ్ పూడి, మేకప్: మహేంద్ర, కాస్ట్యూమ్స్: కోటేశ్వరరావు, ప్రొడక్షన్ మేనేజర్: శ్రీధర్, ప్రొడక్షన్ కంట్రోలర్: వెంకట్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.వి రమణారావు, పి ఆర్ ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.