ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> F3 First Single Lab Dab Lab Dab Dabboo Out Now

ఎఫ్ 3 ఫస్ట్ సింగిల్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు

F3 First Single Lab Dab Lab Dab Dabboo Out Now

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క‌లిసి మోస్ట్ ఎవెయిటింగ్ ఫన్-ఫిల్డ్ ఎంటర్టైనర్ ఎఫ్‌3తో ఈ వేస‌వికి మూడు రెట్ల వినోదాన్ని అందించబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ని న‌వ్వుల‌లో ముంచెత్త‌డానికి ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు ను విడుదల చేశారు. ఈ పాటలో డబ్బుకు ఉన్న శక్తి, గొప్పదనాన్ని వివరించారు. ఈ క‌థ డబ్బు చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలిసిందే.

ఈ పాట కోసం దేవీ శ్రీ ప్రసాద్ చక్కటి బాణీని సమకూర్చారు. రామ్ మిర్యాల గాత్రం, భాస్కర భట్ల సాహిత్యం పాటను మరింత అందంగా మలిచాయి. విజువల్‌గా కూడా ఈ పాట ఎంతో స్టైలీష్‌గా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.

శ్రోతలను ఈ పాట ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు భిన్న గెటప్స్‌లో కనిపిస్తున్నారు. ఈ పాటలో తమన్నా కూడా కనిపిస్తున్నారు. పాట చివర్లో సినిమాలోని నటీనటులంతా కూడా డబ్బు రావాలని చేసే ప్రార్థనలు అందరికీ నవ్వు తెప్పించేలా ఉంది.

నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వినోదం, గ్లామర్ ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Venkatesh, Varun Tej, Anil Ravipudi, Sri Venkateswara Creations F3 First Single Lab Dab Lab Dab Dabboo Out Now

venkatesh
varun tej
anil ravipudi
sri venkateswara creations
f3 movie
lab dab lab dab dabboo song