Advertisementt

సెబాస్టియన్ పిసి524 టీజర్ 

Sat 05th Feb 2022 11:52 AM
sebastian pc524,kiran abbavaram,sebastian pc524 teaser  సెబాస్టియన్ పిసి524 టీజర్ 
Sebastian PC524 teaser launch సెబాస్టియన్ పిసి524 టీజర్ 
Advertisement
Ads by CJ

టాలెంట్‌ ఉన్నోళ్లకు టాలీవుడ్‌ ఎప్పుడూ వెల్కమ్‌ చెబుతుంది. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయమై కంటెంట్‌ ఉన్న కుర్రాడని కిరణ్‌ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపంతో మరో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. క్లాసు - మాసు, యూత్ - ఫ్యామిలీ... అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. సెబాస్టియన్ పిసి 524తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా సెబాస్టియన్‌ పిసి524. కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లు. తెలుగులో ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.

నీకు రేచీకటి (నైట్ బ్లైండ్‌నెస్‌) అన్న విషయం ఎవ్వరికీ తెలియనివ్వొద్దయ్యా! అని తల్లి చెప్పే మాటతో సెబాస్టియన్ పిసి524 టీజర్ మొదలైంది. సినిమాలో హీరోకి రేచీకటి అనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్ సెబాస్టియన్ పాత్రలో జాకీ చాన్ స్టయిల్‌లో కిరణ్ అబ్బవరం ఎంట్రీ ఇచ్చారు. పేరు ఏమో క్రిస్టియన్ లాగా ఉండాది. వచ్చింది ఏమో గుడి కాడనుండా అని శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పే డైలాగ్ వింటుంటే... హీరోకి భక్తి ఉందని తెలుస్తోంది.

రేచీకటి గల హీరో నైట్ డ్యూటీ ఎలా చేశాడన్నది ఆసక్తికరంగా ఉంది. దయగల ప్రభువా... ఈ రాత్రి మదనపల్లి పట్టణ ప్రజలకు ఏ ఇబ్బందీ రాకుండా చూడు తండ్రి. నీకు స్తోత్రం, ప్రభువా... ఒకరాత్రి వీళ్లకు కళ్లు కనపడకుండా చూడు ప్రభువా! ఎన్ని వణుకుతాయో అర్థం కావడం లేదు, నేను దేవుడి బిడ్డను కాదన్నమాట అని హీరో చెప్పే డైలాగులు వినోదాత్మకంగా ఉన్నాయి. మొత్తం మీద సినిమాపై టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ టీజర్ ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.

Sebastian PC524 teaser launch:

Kiran Abbavaram Sebastian PC524 teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ