Advertisementt

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్.. కరోనా కరుణిస్తేనే రిలీజ్

Wed 02nd Feb 2022 03:04 PM
pakka commercial,gopichand,maruthi,geetha arts 2,allu aravind,bunny vaas  ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్.. కరోనా కరుణిస్తేనే రిలీజ్
Pakka Commercial release date fix ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్.. కరోనా కరుణిస్తేనే రిలీజ్
Advertisement
Ads by CJ

సీటిమార్ సూపర్ హిట్ తర్వాత గోపీచంద్,  ప్ర‌తిరోజు పండ‌గే లాంటి స‌క్సెస్ తర్వాత ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. పక్కా కమర్షియల్ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఈ మధ్యే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వచ్చిన టైటిల్ సాంగ్ టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు దర్శక నిర్మాతలు. మే 20, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే రిలీజ్ డేట్ పోస్టర్ లో ఉన్న కరోనా కరుణిస్తే అని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. 

Pakka Commercial release date fix:

Pakka Commercial in theatres from May 20th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ