చాలామంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటారు. స్టార్ హీరోలు, హీరోయిన్స్, ఆర్టిస్ట్ లు, సీరియల్ ఆర్టిస్ట్ లు. వారు సెలెబ్రిటీ హోదాలో భీబత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని కలిగి ఉంటారు. అందుకే వాళ్ళు ఏది పోస్ట్ చేసినా ఇట్టే వైరల్ అవుతాయి. సెలబ్రిటీస్ తమ సినిమా విషయాలతో పాటుగా, పర్సనల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకి షేర్ చేస్తారు. ఈ సోషల్ మీడియా విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చాక మంచి ఎంతగా జరిగిందో, దాని వలన దుష్ప్రణామాలు అంతే ఉన్నాయి. అంటే స్టార్ హీరోలు వాళ్ళ ఫ్యామిలీ లపై ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నెగెటివ్ న్యూస్ లు, అలాగే వేరే వాళ్ళని కించపరచడం లాంటివి ఎక్కువయ్యాయి.
ట్విట్టర్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ అస్సలు ఆక్టివ్ గా లేని సెలబ్రిటీస్ ఫామిలీస్ ని కూడా కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి లాభం పొందాలని చూస్తుంటారు. రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి పేరుతో ఓ ఫేక్ అకౌంట్ వెలిసింది. ఆమె నేను మొదటిసారిగా ట్విట్టర్ లోకి అడుగుపెడుతున్నాను అని, తన భర్త ఎన్టీఆర్ తో ఉన్న ఓ చీప్ పిక్ ని పోస్ట్ చేసినట్లుగా ఓ ఫేక్ ఐడి క్రియేట్ చేసి వైరల్ చేసారు. అసలు ఎన్టీఆర్ వైఫ్ సోషల్ మీడియాలోకి రాలేదు. ఆమె అసలు అంతగా బయటికి ఫోకస్ అయిన సందర్భమూ లేదు. కానీ ఆమె పేరు మీద ట్విట్టర్ లో ఓ అకౌంట్ క్రియేట్ చేసి ఇలా చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకి తెలియాలి.
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ వైఫ్, ఒకప్పటి హీరోయిన్ షాలిని పేరు మీద కూడా ఆకతాయిలు ట్విట్టర్ లో ఓ ఫేక్ అకౌంట్ తెరిచి.. అజిత్ తో షాలిని ఉన్న పిక్ ని పోస్ట్ చేసి వైరల్ చేసారు. ఇలా సోషల్ మీడియాలో లేని వారి పేర్ల మీద, వాళ్ళ ఫామిలీస్ పేర్ల మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అల్లరి చెయ్యడం ఎంతవరకు కరెక్ట్. ఇలాంటి ఫేక్ అకౌంట్ ని ఆపేదెలా..?