Advertisementt

అశోక వనంలో అర్జున కళ్యాణం టీజర్

Wed 02nd Feb 2022 01:22 PM
vishwak sen,ashoka vanamlo arjuna kalyanam teaser,ashoka vanamlo arjuna kalyanam movie,vidyasagar chita  అశోక వనంలో అర్జున కళ్యాణం టీజర్
Ashoka Vanamlo Arjuna Kalyanam teaser treat అశోక వనంలో అర్జున కళ్యాణం టీజర్
Advertisement
Ads by CJ

ఫ‌ల‌క్‌నుమాదాస్ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం. విద్యా సాగ‌ర్ చింతా తెరకెక్కిస్తున్న ఈ  సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతుంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా అశోక వనంలో అర్జున కళ్యాణం టీజర్ రిలీజ్ చేసి.. దానితో పాటుగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. 

ఛీ దీనమ్మా తాగితే కానీ మా బతులకి ఏడుపు రాదు.. తాగినోడి ఏడుపుకేమో వేల్యూ లేదు అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ పెళ్లి కొడుకు అర్జున్ కుమార్ అల్లం (విశ్వక్ సేన్) పెళ్లి కూతురు (రుక్సర్ థిల్లాన్)తో ఎమోష‌న‌ల్‌గా డైలాగ్ చెబితే ఎలా ఉంటుంది! క‌చ్చితంగా అదేదో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి అయితే క‌లుగుతుంది. మూడు ప‌దుల వ‌య‌సున్న అర్జున్ కుమార్‌కి పెళ్లి ఎందుకు కాలేదు. చివ‌ర‌కి పెళ్లి కోసం అర్జున్ కుమార్ అండ్ ఫ్యామిలీ ఏం చేశారు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే అశో వ‌నంలో అర్జున కళ్యాణం మూవీ చూడాల్సిందే. 

టీజర్లోకి వెళితే... ఇంట‌ర్ క్యాస్ట్ అరెంజ్డ్ మ్యారేజ్ (పెద్ద‌లు కుదిర్చిన కులాంత‌ర వివాహం) సినిమాల్లోనే అయితాదారా.. లేక ఇదే ఫ‌స్టా! అని ఓ అమ్మాయి అడ‌గ‌టంతో ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ టీజ‌ర్ స్టార్ట్ అయ్యింది. ఇందులో విశ్వ‌క్ సేన్ పెళ్లి కొడుకుగా క‌నిపిస్తున్నారు. విశ్వ‌క్ సేన్‌, రుక్స‌ర్ థిల్లాన్‌ల‌పై ఎంట‌ర్‌టైనింగ్ స‌న్నివేశాల‌ను చూపించారు. టీజ‌ర్ చివ‌ర‌లో విశ్వ‌క్ సేన్ ఏడుస్తూ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా ఉంది. టీజ‌ర్‌లో స‌న్నివేశాల్లో పాత్ర‌ల‌ చిత్రీక‌ర‌ణ‌, పిక్చ‌రైజేష‌న్‌తో పాటు డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. 

Ashoka Vanamlo Arjuna Kalyanam teaser treat :

Ashoka Vanamlo Arjuna Kalyanam  teaser treat  released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ