Advertisementt

ఫిబ్రవరి 4న కే3 కోటికొక్కడు

Sun 30th Jan 2022 11:36 AM
k3 kotikokkadu,baadshah sudeep,kichha sudeep  ఫిబ్రవరి 4న కే3 కోటికొక్కడు
K3 Kotikokkadu gets its Release Date ఫిబ్రవరి 4న కే3 కోటికొక్కడు
Advertisement
Ads by CJ

తెలుగు ప్రేక్షకులకు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సుదీప్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ కే3 కోటికొక్కడుతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నారు. శివ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

కన్నడలో కే 3 చిత్రం విడుదలై ట్రేడ్ లెక్కల ప్రకారం రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు చేసి సుదీప్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని తెలుగులో  ఫిబ్రవరి 4న‌ గ్రాండ్ గా విడుద‌ల‌చేయ‌నున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన కే3 కోటికొక్కడు ట్రైలర్‌ లో  సుధీప్ రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు. మడోన్నా సెబాస్టియన్ సుదీప్ జోడి చూడముచ్చటగా ఉంది.  ట్రైలర్‌లో శ్రద్దా దాస్, రవి శంకర్, నవాబ్ షా తదితరులు కనిపించారు. యాక్షన్ ప్యాక్ డ్ గా రిలీజైన కే3 కోటికొక్కడు తెలుగు ట్రైల‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వచ్చింది.  

K3 Kotikokkadu gets its Release Date:

The most anticipated Baadshah Sudeep K3 Kotikokkadu gets its Release Date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ