Advertisementt

ATM వెబ్ సిరీస్ అనౌన్స్‌మెంట్

Thu 27th Jan 2022 07:13 PM
atm,atm web,atm web series announcement,dil raju,harish shankar,journalist phani turned writer,writer phani kandukuri,atm telugu web series  ATM వెబ్ సిరీస్ అనౌన్స్‌మెంట్
ATM Telugu Web series announcement ATM వెబ్ సిరీస్ అనౌన్స్‌మెంట్
Advertisement
Ads by CJ

దిల్ రాజు ప్రొడక్షన్స్, జీ 5 కాంబినేషన్‌లో.. శిరీష్ సమర్పకుడిగా ఎస్.హరీష్ శంకర్, హర్షిత్, హన్షిత నిర్మాతలుగా చంద్ర‌మోహ‌న్‌ డైరెక్షన్‌లో రూపొందుతోన్న వెబ్ సిరీస్ ATM అనౌన్స్‌మెంట్

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలను అందించిన హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజుకి చెందిన దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ ఇప్పుడు డిజిట‌ల్ రంగంలోకి అడుగు పెట్టింది. దిల్ రాజు ప్రొడక్షన్స్, ZEE 5 క‌ల‌యిక‌లో రూపొందిన ఒరిజిన‌ల్ ATM (ఎనీ టైమ్ మెమొరీ). శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్.హరీష్ శంకర్, హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మాత‌లుగా వెబ్ సిరీస్ రూపొందుతుంది. ATM వెబ్ సిరీస్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఈవెంట్ గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ZEE 5 వైస్ ప్రెసిడెంట్ ప‌ద్మ‌, నిర్మాత హ‌న్షిత‌, ATM ఢైరెక్ట‌ర్ చంద్ర‌మోహ‌న్‌, డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌, నిర్మాత దిల్ రాజు త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 

ZEE 5 వైస్ ప్రెసిడెంట్ ప‌ద్మ మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌ను ఆడియెన్స్‌కు అందించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాం. అలాగే అందిస్తూ వ‌స్తున్నాం. ఇలాంటి త‌రుణంలో దిల్‌రాజుగారు, హ‌రీష్ శంక‌ర్ వంటి వారితో క‌లిసి ప‌నిచేయడం మంచి ఎక్స్‌పీరియెన్ష్ అనే చెప్పాలి. మేం అస‌లు ఊహించ‌ని కాంబోతో వ‌ర్క్ చేశాం. త‌ప్ప‌కుండా స్క్రిప్ట్‌, స్క్రీన్ ప్లే హాలీవుడ్ త‌ర‌హాలో ఉంటుంది. హ‌న్షిత‌, హ‌ర్షిత్ వంటి వారితో, మంచి టీమ్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం గౌర‌వంగా భావిస్తున్నాం అన్నారు. 

డైరెక్ట‌ర్ చంద్ర మోహ‌న్ మాట్లాడుతూ.. నాకు డైరెక్టర్‌గా అవ‌కాశం ఇచ్చిన నిర్మాత దిల్ రాజు, డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌గారికి థాంక్స్‌. హ‌రీష్ శంక‌ర్‌గారు మంచి స్క్రిప్ట్ అందించారు. ఓ మెంట‌ర్‌లా నా వెంట ఉండి న‌డిపించారు. రాజుగారి బ్యాన‌ర్‌లో డైరెక్ట‌ర్ చేయ‌డం ఆనందంగా ఉంది. శిరీష్‌, హ‌రీష్ శంక‌ర్‌, హ‌ర్షిత్‌, హ‌న్షిత అంద‌రికీ థాంక్స్‌. జీ 5 టీమ్‌కు ధ‌న్య‌వాదాలు. ప్రేక్ష‌కుల ఆశీర్వాదాలు కావాలి అన్నారు. 

హ‌న్షిత మాట్లాడుతూ.. 20 ఏళ్లు ముందు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్టార్ట్ అయ్యింది. డాడీ, శిరీష్‌గారు ప్రేక్ష‌కుల ఆశీర్వాదాల‌తో ఎన్నో హిట్స్‌, సూప‌ర్ హిట్ సినిమాలు చేశాం. ఇప్పుడు డిజిట‌ల్ మాధ్య‌మంలోఇక అడుగు పెడుతున్నాం. అదేలా ఆశీర్వాదాల‌ను అందించాల‌ని కోరుకుంటున్నాం. హ‌రీష్ అన్న‌గారు ఈ క‌థ‌ను అందించారు. మంచి కంటెంట్‌ను అందిస్తోన్న జీ5 వారితో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం ఆనందంగా ఉంది. చంద్ర‌మోహ‌న్ గారు చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు అన్నారు. 

ఎస్.హరీష్ శంకర్ మాట్లాడుతూ.. మా మేనేజర్ కళ్యాణ్ గారి వల్లే ఈ సిరీస్ చేశాం. త‌న వ‌ల్లే ఈ క‌థ‌ను రాశాను. అంద‌రికీ న‌చ్చిన క‌థ‌. ఈ క‌థ‌ను చంద్ర మోహ‌న్‌కు చెప్పిన‌ప్పుడు, త‌ను త‌న టీమ్‌తో కూర్చుని ఎపిసోడ్ వైజ్ బ్రేక్ చేస్తూ.. మ‌ళ్లీ క‌థ‌ను కొత్త‌గా చెప్పాడు. ఆ క్రెడిట్ త‌న‌కే దక్కుతుంది. త‌ను మంచి టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. జ‌ర్న‌లిస్ట్ ఫ‌ణిగారిని రైట‌ర్‌గా ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాం. డ‌బ్బులుంటే అంద‌రూ ప్రొడ్యూస్ చేయ‌లేరు. అదొక ఆర్ట్‌. ఎలా ప్రొడ్యూస్ చేయాల‌ని అనుకున్న‌ప్పుడు మా రాజ‌న్న‌(దిల్ రాజు) మైండ్‌లోకి వ‌చ్చారు. త‌న‌కు ఎప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను. అలాగే దీంతో మా హ‌న్షిత, హ‌ర్షిత్‌, శిరీషన్న నిర్మాత‌లుగా డిజిట‌ల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాం. జీ5 గారితో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం హ్యాపీ అన్నారు. 

దిల్ రాజు మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూటర్‌గా మొద‌లై స‌క్సెస్‌లు సాధించిన త‌ర్వాత నెక్ట్స్ ఏంటి? అని అనుకున్న‌ప్పుడు ప్రొడ్యూస్ చేయాల‌ని అనుకున్నాను. 2003లో దిల్ సినిమాతో నిర్మాత‌గా ప్ర‌యాణం స్టార్ట్ చేశాను. అక్క‌డ నుంచి కొత్త వాళ్ల‌ని ప‌రిచ‌యం చేస్తూ ఆర్య‌, బొమ్మ‌రిల్లు, మున్నా.. ఇలా వ‌రుస సినిమాలు చేస్తూ వ‌చ్చాను. ఇలా ప్ర‌తి సినిమాకు ఇది దిల్ రాజుగారి సినిమా అని ప్ర‌తీ సినిమాకు మంచి అంచ‌నాలు పెర‌గుతూ వ‌చ్చాయి. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా, సంస్థ‌గా ఎదిగాం. స్టార్స్‌తో, కొత్త‌వాళ్ల‌తో మంచి సినిమాల‌ను అందిస్తూ ఇక్క‌డి వ‌ర‌కు ప్రయాణించాం. ఈ స్టేజ్‌లో ఉండ‌టానికి ఎంతో మంది ద‌ర్శ‌కులు కృషి ఉంది. నిర్మాతగా 50 సినిమాల‌ను పూర్తి చేస్తున్నాం. సినిమాలో మార్పులు వ‌స్తున్నాయి. వాట్ నెక్ట్స్ అనే ప్ర‌శ్న ఎదురైంది. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ను స్టార్ట్ చేశాను. అప్పుడు ఏదైనా కొత్త‌గా స్టార్ట్ చేయాల‌నిపించింది. అప్పుడు హిందీలో స‌క్సెస్‌ఫుల్‌గా హిట్‌, జెర్సీ సినిమాల‌ను పూర్తి చేయ‌గ‌లిగాం. అలా బాలీవుడ్‌లో దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ ఎంట్రీ ఇవ్వ‌నుంది.

ఇక తెలుగులో కొత్త‌గా ఏం చేయాలి అని అనుకున్న‌ప్పుడు .. కొత్త జ‌న‌రేష‌న్ రెడీగా ఉంది. అప్పుడు హ‌ర్షిత్‌, హ‌న్షిత‌ను అడిగిన‌ప్పుడు వాళ్లు రెడీ అన్నారు. నేను, శిరీష్ వాళ్ల‌కి బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాం. ముందు సినిమాల‌ను చేయించాల‌ని అనుకున్నాం. అయితే గ‌త రెండేళ్లుగా కంటెంట్‌లో మార్పు వ‌చ్చింది. అదే స‌మ‌యంలో హ‌రీష్ శంక‌ర్ నాకు ఫోన్ చేసి ఇలా చంద్ర‌మోహ‌న్ కాన్సెప్ట్ గురించి చెప్పాడు. నేను విన్నాను. త‌ర్వాత జీ 5తో ఉన్న అనుబంధంతో వాళ్ల‌తో క‌లిసి ప్రయాణించాం. హ‌రీష్ శంకర్‌, హ‌న్షిత‌, హ‌ర్షిత్ నిర్మాత‌లుగా ఈ ఏటీఎం అనే వెబ్ సిరీస్ చేయాల‌నుకుని ముందుకు వ‌చ్చాం. 2022లో ఏటీఎం వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాం. కొత్త కాన్సెప్ట్‌తో హ‌రీష్ శంక‌ర్ మార్క్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో అన్నీ ఎలిమెంట్స్ మిక్స్ చేసి వెబ్ సిరీస్ చేశాం. మా బ్రాండ్ వేల్యూతో మీ ముందుకు వ‌స్తున్నాం. దీనికి శిరీష్ స‌మ‌ర్ప‌కుడిగా ఉంటారు. ఎస్.హరీష్ శంకర్, హ‌ర్షిత్‌, హ‌న్షిత నిర్మాతలుగా ఉంటారు. వెబ్ సిరీస్‌తో పాటు కొత్త కంటెంట్ సినిమాల‌ను కూడా వాళ్లు చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారు. హ‌న్షిత‌, హ‌ర్షిత్ దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ ను ముందుకు తీసుకెళ్లాలి. నా లైఫ్‌లో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లా 50 ఏళ్ల లోగోను చూడాల‌ని అనుకుంటున్నాను అన్నారు.

ATM Telugu Web series announcement:

Dil Raju - Harish Shankar Web Series

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ