సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. రిపబ్లిక్ డే స్పెషల్ గా సర్కారు వారి పాట అప్ డేట్ ఇచ్చేసింది టీం. ప్రేమికుల దినోత్సవం నుంచి ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించబోతోన్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న సర్కారు వారి పాట నుంచి రాబోతోన్న ఫస్ట్ సింగిల్.. మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనుంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అద్భుతమైన ట్యూన్ అందించాడు. వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతోన్న ఈ పాట మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల మీద రొమాంటిక్‌గా చిత్రీకరించారు.