స్పోర్ట్స్ డ్రామా జానర్లో రూపొందిన ఒరిజినల్ సిరీస్ లూజర్ తో వీక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రజల కోరిక మేరకు తాజాగా ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన జీ 5 ఒరిజినల్ సిరీస్ లూజర్ 1 ఏంతో ప్రేక్షాదరణ పొందింది.ఆ హిట్ సిరీస్ కు సీక్వెల్ గా లూజర్ 2 ను తీసుకువస్తోంది.తొలి సీజన్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. లూజర్ 2కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. దీనికి అభిలాష్ రెడ్డి క్రియేటర్., అన్నపూర్ణ స్టూడియోస్, స్పెక్ట్రమ్ మీడియా నెట్వర్క్క్ నిర్మించిన ఈ సిరీస్ జీ`5 ఓటీటీలో ఈనెల 21న టెలికాస్ట్ కాబోతుంది. ఈ సందర్భంగా దీని గురించి మరిన్ని వివరాలు తెలియజేసేందుకు గురువారంనాడు అన్నపూర్ణ ఏడెకాల స్టూడియోలో టీమ్ అంతా పాల్గొన్నారు.
ముందుగా నిర్మాత సుప్రియ యార్లగడ్డ లూజర్2 టీమ్‌ను పరిచయం చేస్తూ, అన్నపూర్ణ స్టూడియోస్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులే దీనికి పనిచేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నేను కథలు రాస్తానని అంటారు. కానీ ఆ కథలు బాగుంటాయని ఎదుటివారు చెబితేకానీ తెలీదు. సినిమాకూ, ఓటీటీ కథలకు చాలా వ్యత్యాసం వుంటుంది. ఓటీటీలో చిన్న పాత్ర అయినా చాలా డిటైల్‌గా రాయాలి. భరద్వాజ్, శ్రవన్, అవినాష్ మొదటినుంచి కథను రాయాలని అనుకుని వచ్చారు. అవి విన్న వెంటనే ఏ పాత్రను చూసినా వాటికి పూర్తి న్యాయం చేశారు. వెబ్ కథలు వేరుగా వుంటాయి. అదే సినిమా అయితే లాగ్ అనేది ఎడిటింగ్‌లో తెలిసిపోతుంది. కానీ ఓటీటీలో లాగ్ వుండాలి. దానిలోనూ అందం కనిపించాలి. దానికీ ఓ టైం పిరిడ్ వుంటుంది. అటువంటి దాన్ని సరిగ్గా చూపగలిగితే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఇక స్క్రీన్ ఫేస్‌కూడా దగ్గరా చూపించాలి. అందులో నటీనటులను ఎఫెక్టివ్‌గా చూపించగలగాలి. ఒక్కోసారి కళ్ళు కూడా మాట్లాడుతుంటాయి. దాన్ని క్యాచ్ చేయగలగాలి. మాకు ఫేవర్ అంశం ఏమంటే, దీనికి పనిచేసిన వారంతా మా అన్నపూర్ణ స్టూడియోస్ కాలేజీలో చదువున్న వారే. అందుకే వారి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడి కథ బాగా రావడానికి దోహదపడింది.
దర్శకుడు అభిలాష్ ఒకసారి కథను చెప్పడానికి వచ్చాడు. స్పోర్ట్స్ ఫీల్డ్‌లో సక్సెస్ అవ్వని వారు గురించి చెప్పారు. ఇలాంటి కథలు ఎక్కడా చెప్పలేం. ఓటీటీలోనే చెప్పగలం. అందుకు జీటీ వారు మమ్మల్ని నమ్మడం అందుకు అనుగుణంగా తెరకెక్కించడం జరిగింది. ఇందులో పాత్రల పరంగా పెద్ద వారు. లేరు. అందరూ సరిపడేవిధంగా కుదిరారు. ఇప్పటి యువతరం ఏవైనీ కొత్త విషయాలు మాకు నేర్పించేవారుగా వుండాలి. అలా వున్న టీమ్ మాకు దొరికింది. కొత్తతరంలో టాలెంట్ బాగుంటుంది. రేపు ఓటీటీలో చూసి మీరు తెలుసుకుంటారని తెలిపారు.
నటుటు వెంకట్ మాట్లాడుతూ, సినిమాలుచేసినా ఓటీటీలో చేయడం థ్రిల్ కలిగిస్తుంది. లూజర్2 సిరీస్ నాకు బాగా నచ్చిన కథ. ఇందులో చాలా మంది జీవితాలు మన కళ్ళముందుక నిపించేలా వుంటాయని పేర్కొన్నారు.
దర్శకుడు అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది చాలా ఇష్టపడి చేసిన కథ. పీరియాటిక్ కథతో కూడుకున్నది. ఈ కథకు భరత్, శ్రవణ్ లిద్దరూ రైటింగ్ లో ఫుల్ సపోర్ట్ చేశారు.అలాగే మాకు సపోర్ట్ గా నిలుస్తూ మంచి సూచనలు సుప్రియ గారు ఇచ్చారు వారికి మా ధన్యవాదాలు. నాతోపాటు కొన్ని ఎపిసోడ్స్ శ్రవణ్ డైరెక్ట్ చేశాడు. స్పెక్ట్రా మీడియా నెట్వర్క్ మాకు ఎం కావాలన్నా సహాయ సహకారాలు అందించారు వారికి మా ధన్యవాదాలు. నటీనటులు, టెక్నికల్ టీమ్ అంతా బాగా సపోర్ట్ చేయడంతో ఈ సిరీస్ బాగా వచ్చింది.ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న లూజర్ 2 ను కూడా ప్రేక్షకులందరూ ఆదరించి గొప్ప విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ, .అన్నపూర్ణ బ్యానర్ లో ఎంతో మందికి అవకాశం ఇచ్చినా కూడా వారు గొప్పలు చెప్పుకోరు. మేము లూజర్ కోసం చాలా కష్టపడ్డాము.టెక్నిసిషన్స్ అందరూ చాలా సపోర్ట్ చేయడంతోనే ఈ సీరీస్ ఇంతపెద్ద హిట్ అయ్యింది. మా కిలాంటి మంచి కంటెంట్ ఉన్న సిరీస్ లో నటించే అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియో కు,సుప్రియ గారిగి జీ 5 కు మా ధన్యవాదాలు అన్నారు.
శశాంక్ మాట్లాడుతూ, నేను ఏజ్ వున్న వాడిగా కనిపిస్తాను. ఆ పాత్రను దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. ట్రైలర్లో చూసిన వారంతం మెచ్చుకోవడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన సుప్రియ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో హర్షిత్, పావని, కల్పిక, గాయత్రితోపాటు సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.