Advertisementt

రవితేజ రావణాసుర స్పీడు మాములుగా లేదు

Tue 18th Jan 2022 04:35 PM
ravi teja,sudheer varma,abhishek nama,ravanasura,ravanasura rule begins  రవితేజ రావణాసుర స్పీడు మాములుగా లేదు
Ravi Teja Ravanasura Rule Begins On Sets రవితేజ రావణాసుర స్పీడు మాములుగా లేదు
Advertisement
Ads by CJ

మాస్ మహారాజా రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతున్న `రావణాసుర` సినిమాను సంక్రాంతి ప‌ర్వ‌దినం రోజున మెగాస్టార్ చిరంజీవి మ‌రియు ఇతర అతిథుల‌ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక నుండి `రావణాసుర`పాలన ఆరంభం కానుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను చిత్రయూనిట్ ప్రారంభించింది. ప్రస్తుతం కీల‌క తారాగ‌ణంపై  నైట్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు.

అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు.

రవితేజ ఈ చిత్రంలో న్యాయవాదిగా కనిపించబోతోన్నారు. రామ్ పాత్రలో సుశాంత్ ముఖ్యమైన రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఐదు పాత్రల‌కు కూడా మంచి ప్రాముఖ్యత ఉండ‌నుంది.

రచయితగా శ్రీకాంత్ విస్సా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఆయనే ఈ సినిమాకు కథను అందించారు. సుధీర్ వర్మ తన సినిమాలను ఎంత కొత్తగా, స్టైలీష్‌గా తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నారు. పోస్టర్‌ను బట్టే మనకు ఆ విషయం అర్థమవుతోంది.

ఇక ఈ చిత్రానికి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేయబోతున్నారు. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్‌గా, శ్రీకాంత్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Ravi Teja Ravanasura Rule Begins On Sets:

Ravi Teja, Sudheer Varma, Abhishek Nama Ravanasura Rule Begins On Sets

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ