Advertisementt

ఖండన: సినిమా నిర్మాతలు బలిసినవాల్లు.!

Mon 10th Jan 2022 05:53 PM
telugu film producers council,tfpc,prasannakumar,mohan vadlapatla,prasannakumar reddy  ఖండన: సినిమా నిర్మాతలు బలిసినవాల్లు.!
Telugu Film Producers Council Press note ఖండన: సినిమా నిర్మాతలు బలిసినవాల్లు.!
Advertisement
Ads by CJ

కోవూరు శాసన సభ్యులు శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు సినిమా నిర్మాతలనుద్దేశించి మాట్లాడుతూ.. మన సినిమా నిర్మాతలను బలిసినవాల్లు, అని అనడం జరిగింది. ఇది చాలా బాధాకరం, నిజ నిజాలు తెలియకుండా ఒక గౌరవ శాసన సభ్యులు ఈ విధంగా మాట్లాడటం, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను అవమానించినట్టు గా భావిస్తున్నాము, మన తెలుగు సినిమా సక్సెస్ రేటు సుమారుగా 2 నుండి 5%మాత్రమే, మిగిలిన సినిమాలు నష్టపోవడం జరుగుతుంది.

చిత్రసీమలో ఉన్న 24 క్రాఫ్ట్స్ కు పని కల్పిస్తూ, అనేక ఇబ్బందులు పడి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాతలు, చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది. ఈ కష్ట, నష్టాల, బారిన పడి కొంతమంది నిర్మాతలు చలన చిత్ర నిర్మాతల మండలి నుండి నెలకు 3000/- రూపాయలు పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది, దీనిని బట్టి చలన చిత్ర నిర్మాతలు ఎటువంటి దారుణ పరిస్థితులలో  ఉన్నారన్న సంగతి తేట తెల్లమవుతుంది. గౌరవ శాసన సభ్యులు శ్రీ. ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్మాతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ వారి వ్యాఖలను ఉపసంహరించుకోవాలని కోరుచున్నాము.

Telugu Film Producers Council Press note:

Telugu Film Producers Council Intersection

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ